YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పైలట్, మరో 18 మంది ఎమ్మెల్యేలకు అధిష్టానం నోటీసులు .... రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం

పైలట్, మరో 18 మంది ఎమ్మెల్యేలకు అధిష్టానం నోటీసులు .... రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం

జైపూర్ జూలై 15 
సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ భేటీకి గైర్హాజరుపై రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని లేని పక్షంలో పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి అవినాశ్ పాండే తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కి ఎదురుతిరిగిన సచిన్ పైలట్, తన వెంట 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, గెహ్లాట్ ప్రభుత్వం మెనార్టీలో పడిపోయిందని ఆదివారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం నివాసంలో, మంగళవారం హోటల్‌లో నిర్వహించిన రెండు సీఎల్పీ సమావేశాలకు సచిన్‌తో పాటు ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. కాగా, సచిన్ పైలట్‌ను పార్టీ నుంచి తొలగించాలని మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీ మంగళవారం సచిన్ పైలట్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవుల నుంచి ఆయనను తొలగించింది. అలాగే సచిన్ వెంట ఉన్న మంత్రులు విశ్వేందర్ సింగ్, రమేష్ మీన్‌లను క్యాబినెట్ నుంచి తప్పించింది. తాజాగా బుధవారం సచిన్ పైలట్‌తో సహా ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరుకాలేదో రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో అనర్హతవేటు వేస్తామని హెచ్చరించింది. ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు మరి కొందరి ఇంటి ముందు ఈ మేరకు అంటించిన నోటీసులు కనిపించాయి

Related Posts