YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనాకు ఉచితంగా చికిత్స: తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

కరోనాకు ఉచితంగా చికిత్స: తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్ జూలై 15 
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతుండటం తో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం కరోనా రోగులకు  చికిత్స అందించే ప్రభుత్వ  హాస్పిటల్స్ తో పాటుగా మెడికల్ కాలేజీల్లో  కరోనాకు ఉచితంగా చికిత్స చేయాలనీ  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ను ప్రభుత్వం ఎంపిక చేసింది. మమత మల్లారెడ్డి కామినేని ఇనిస్టిట్యూట్ ఈ మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఉచిత వైద్యం అందించనున్నారు. అదే విధంగా మరో ఏడు ప్రైవేట్ బోధనా దవాఖానలను కూడా త్వరలో ఈ జాబితాలో చేర్చనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారుప్రతిరోజూ కూడా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి భారిన సామాన్యులతో పాటుగా  పలువురు ప్రజా ప్రతినిధులు వైద్యులు పోలీసులు నటులు కూడా ఈ వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..కాగా ప్రస్తుతం తెలంగాణలో  మంగళవారం 1524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో  ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37745కి చేరింది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 375 మంది మరణించారు. అలాగే  రాష్ట్ర వ్యాప్తంగా 24840 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Related Posts