కాకినాడ జూలై 15
భారత సముద్ర జలాల్లోకి శ్రీలంక బోటు దూసుకొచ్చింది. అప్రమత్తమైన కాకినాడ కోస్టు గార్డ్ బృందం పట్టుకుంది. చేపల వేట కోసం కేజీ బేసిన్ పరిధి వరకు ఇందువర ఫిషింగ్ బోట్ వచ్చేసింది. భారత కోస్ట్ గార్డ్ బృందాన్ని చూసి పరారయ్యేందుకు శ్రీలంక మత్స్యకారులు ఆరుగురు ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించిని గస్తీ నౌక ప్రియదర్శిని ద్వారా కోస్ట్ గార్డ్ పోలీస్‌లు పట్టుకున్నారు. ఆ మత్స్యకారుల నుంచి భారీ టునా చేపను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తీరప్రాంత భద్రత అధికారులు మాట్లాడుతూ శ్రీలంకలోని మత్తరకు చెందిన బోటు భారత జలాల్లోకి ప్రవేశించి టూనా చేపలను వేటాడుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఐసీజీఎస్ ప్రియదర్శిని కోస్ట్ గార్డ్ బోటులో కాకినాడ నుంచి వెళ్లిన సిబ్బంది బోటును వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. కేజీ బేసిన్ లో టూనా చేపలను వేటాడేందుకు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని వివరించారు. బోటులో ఉన్న ఆరుగురిపై ఇండియన్ ఫిషింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.