అమరావతి జూలై 15
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3, 7 సెక్షన్ లను సవరణ చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. పగటిపూట 9గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కేబినేట్ లో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కరువు నివారణ అభివృద్ది ప్రాజెక్ట్ కార్పోరేషన్ ను ఏర్పాటు, గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపు పై కేబినేట్ లో చర్చ జరిగింది. బుధవారం నాడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమయింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరో రెండు వేల కోట్ల రూపాయల లోను తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో ఏపిఐఐసికి మంత్రి మండలి అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై కేబినేట్ లో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్స్ డిపార్ట్ మెంట్ లో ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ కేబినేట్ ఆమోదించింది. 31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి, సిఐడి విభాగంలో 9జూనియర్ స్టెనోలను, 10 జూనియర్ అసిస్టెంట్లను, 10 టైపిస్ట్ ల పోస్టింగ్ లను ఏర్పాటు, అంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ 2020 జారీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో 17పోస్టులకు అనుమతిచ్చింది. ఐదు కోట్లతో కర్నూలు జిల్లాలో గొర్రెల పెంపక శిక్షణాకేంద్రం ఏర్పాటు, తొమ్మిదిన్నర కోట్లతో కర్నూలు జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజి, ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటుకు కేబినేట్ అమోదించింది.