హైదరాబాద్ జూలై 15
హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) లో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం సమావేశమయ్యారు. ఐటి, ఐటి అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతో పాటు భవిష్యత్తులో రానున్న ఐటీ కంపెనీల ఏర్పాటు వాటికి సంబంధించిన మార్గదర్శకాలను పైన చర్చ జరిగింది. మంత్రి మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటి ని నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీతో ముందుకు రానున్నది. ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్ కి తరలించే ప్రయత్నం లో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని అన్నారు. ఇందుకోసం అవసరమైన రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన పైన అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేసారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను పలు కంపెనీల ప్రతినిధులకు అందజేసారు. ఈ ఐదు కంపెనీలు సుమారు 25 లక్షల చదరపు అడుగుల ఐటీ పార్కుల ను లేదా కార్యాలయాలకి అవసరం అయినా ఆఫీస్ స్పేస్ ని అభివృద్ధి చేయను ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ పరిశ్రమ జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధి చెందుతూ వస్తున్నది. హైదరాబాద్ పట్టనం నలువైపులా సమతుల్యంగా అభివృద్ధి చెందాలన్నా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వస్తున్న గ్రిడ్ విధానంతో ఐటీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళతాయన్న నమ్మకం ఉన్నది. ఇప్పటికే ఇక్కడ అందుబాటులో ఉన్న మెట్రో, శిల్పారామం, మూసి నది అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలికవసతుల పెరుగుతున్నాయి. ఇప్పటికే నగరం నలువైపులా ఐటీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల పరిశ్రమలు రూపాంతరం చెందుతున్నాయి. అవుటర్ రింగ్రోడ్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్ళితే వారి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు.