YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రమాదాల వెనుక.. సెల్ ఫోన్లు..

ప్రమాదాల వెనుక.. సెల్ ఫోన్లు..

విశాఖపట్టణం, జూలై 16, 
ఎల్జీ పాలిమర్స్ నుంచి తాజాగా విశాఖలో జరిగిన ఫార్మా కర్మాగారం వరకు అనేక భారీ ప్రమాదాలపై ప్రధాన కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీలక విభాగాల్లో పనిచేసేవారి సెల్ ఫోన్స్ వీటికి కారణం అన్నది కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలు. ముఖ్యంగా బాయిలర్లు ఇతర కెమికల్స్ ను నియంత్రించే విభాగాల వద్ద పనిచేసేవారు అసలు పని వదిలి సెల్ ప్రపంచంలోకి వెళ్ళి కాలక్షేపం చేయడమే ఉపద్రవాలకు రీజన్ అంటున్నారు. వాట్స్ అప్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి వాటిని చూడకుండా చాటింగ్ లు వంటివి చేయకుండా నేటి నెటిజెన్స్ ఉండలేకపోతున్నారు. నడుస్తున్నా, ప్రయాణిస్తున్నా, నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అందరికి అదో వ్యసనం అయిపొయింది.ఇప్పుడు ఎవరు ఏ ఉద్యోగం లో ఉన్నా అసలు పని వదిలి సెల్ ప్రపంచంలో పడిపోతున్నారు. నిన్న మొన్నటివరకు నడిచిన టిక్ టాక్ వల్ల దేశంలో ఎందరో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు కోల్పోయారు. అంతే కాదు ఎందరో సెల్ ఫోన్ లో మునిగి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఇక చిన్నారులు విద్యా సంస్థల్లో వాడకం మొదలు పెట్టాకా చదువుల తీరే మారిపోయింది. తమ పని వదిలిపెట్టి వీటిలో పడటం ఉద్యోగాలు పోతే పోయాయి కానీ కీలకమైన, ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదాలు జరిగే చోట పనిచేసేవారు నిర్లక్ష్యం గా చేసే తప్పులే అనర్ధానికి దారి తీస్తున్నాయని అంటున్నారు నిపుణులు.ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసేవారికి సెల్ ఫోన్స్ వాడకం నిషేధం విధిస్తే చాలా వరకు ప్రమాదాలు నివారణ అవుతాయని సూచిస్తున్నారు. విశాఖలో తాజాగా జరిగిన సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదానికి సెల్ ఫోన్ కారణమని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూడా విచారణ కమిటీలు దృష్టి పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు సెల్ ఫోన్స్ వాడకం వల్ల జరగకుండా చుడాల్సి ఉంది.

Related Posts