YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ లో రాష్ట్రపతి పాలన .. ?

బీహార్ లో రాష్ట్రపతి పాలన .. ?

పాట్నా, జూలై 16, 
హార్ లో ఎన్నికలు జరుగుతాయా? ఎన్నికలు జరపలేకపోతే పరిస్థితి ఏంటి? రాష్ట్రపతి పాలన పెడతారా? అదే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. బీహార్ లో ఈ ఏడాది అక్టోబర్, నవంబరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్ ప్రభుత్వ కాలపరిమితి పూర్తి కావడంతో రాజ్యాంగ పరంగా తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చలు జరుపుతోంది.అయితే అక్టోబరు, నవంబరు నెలల్లో భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. నిపుణుల హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో రోజుకు లక్ష కేసులు కూడా వచ్చే అవకాశముందని వివిధ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. అయితే బీహార్ ఎన్నికలు సకాలంలో జరుపుతామని ఇప్పటికే ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల్లో భౌతిక దూరం పాటిస్తూూ పోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ భావిస్తుంది.పోలింగ్ కేంద్రాలను పెంచడంతో పాటు కోవిడ్ బాధితులకు, ఐసొలేషన్ లో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలట్ అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికలు జరిగితే ఎంతమంది ఓటింగ్ కు వస్తారన్నది అనుమానంగా ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ప్రజలు రాకపోవచ్చు. దీంతో బీహార్ లోని ప్రధాన పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు సుముఖంగా లేవు.ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో జరిపితే ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడితే దానికి బాధ్యులెవరన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే రాష్ట్రపతి పాలనను బీహార్ లో విధిస్తారన్న చర్చ జోరుగా సాగుతుంది. రాష్ట్రపతి పాలన విధిస్తే మరో ఆరు నెలల పాటు ఎన్నికలను వాయిదా వేసే అవకాశముంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అక్టోబరు, నవంబరు నెలలో రాష్ట్రపతి పాలన విధిస్తే మే వరకూ ఎన్నికలువాయిదా వేసే అవకాశముందంటున్నారు. మొత్తంమీద బీహార్ ఎన్నికలను కరోనా వైరస్ అడ్డుకుంటుందనే వార్తలు హస్తినలో గుప్పుమంటున్నాయి

Related Posts