జగ్గంపేట జూలై 16,
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్ లు అందోళనకు దిగారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు నాలుగు నెలలు వరకు ప్రైవేటు బస్సు డ్రైవర్లు మనుగడ ఆగమ్యగోచరంగా ఉందని వారు అంటున్నారు. నాలుగు నెలలుగా ప్రైవేట్ డ్రైవర్ల అందరికీ జీతభత్యాలు లేవని, ఇదే విషయం ఓనర్స్ దృష్టికి తీసుకు వెళ్తే బస్సులు నడవకుండా మేము జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేయడంతో డ్రైవర్లు బతుకులు రోడ్డున పడ్డాయి. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఫాస్టర్ లకు, నాయి బ్రాహ్మణులకు, ఆటో డ్రైవర్లకు ఎలా అయితే అండగా నిలబడిందో, అలానే నాలుగు నెలల నుండి ఎటువంటి జీతభత్యాలు లేని మాకు కూడా ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక సహాయం అందించాలని, లేనియెడల మాకు పని కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు బస్ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి వీర్రాజు, సెక్రటరీ రాంబాబు, జాయింట్ సెక్రెటరీ వల్లి, సభ్యులు బాబి, గోకవరం ఎయిర్ బస్సు డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు నక్కా రామరాజు, వీరబాబు, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.