అమరావతి జూలై 16
తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను కలిసారు. రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఘటనల గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను ఆయనకు వివరించారు. గత 14 నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ బృందంలో ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్, కనకమేడల రవీంద్రలు వున్నారు