YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తక్షణమే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకపోతే పోరాటం తప్పదు

తక్షణమే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకపోతే పోరాటం తప్పదు

కడప జూలై 16 
కడప జిల్లాలోని కడప జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయము వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించకపోతే పోరాటం చేయక తప్పదని అన్నారు.  స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు 1988లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శంకుస్థాపన చేశారని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ పతకాలు సాదించిందన్నారు. కడప జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీపీపీని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశ్రామికంగా జిల్లా బాగా వెనుకబడి వుందని ,తక్షణమే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.  కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.  ఆర్టీపీపీ లో  ఉద్యోగులు ఆందోళనలు   చేసిన ఫలితంగా  ఆర్టీపీపీ ని నడుపుటకు రాష్ట్రప్రభుత్వం ఎక్సపర్ట్ కమిటీని ముగ్గురు సభ్యులతో వేసిందన్నారు.
కమిటీ  ఫిబ్రవరి20 న ఆర్టీపీపీని సందర్శించారని తెలిపారు. ఆర్టీపీపీ కి వచ్చి అధ్యయనం చేయకుండా వెళ్లిందన్నారు. ప్రస్తుతం  ఆర్టీపీపీలో 5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిలువ ఉన్నదన్నారు. ఆర్టీపీపీకి  నీటి కొరత రాకుండా చేసేందుకు బ్రహ్మంసాగర్ నుంచి పైపులైను కూడా వేసి బలోపేతం  చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు.  ఆర్టీపీపీ ని నమ్ముకొని  కొన్ని వేలమంది   ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాది   పొందుతున్నారన్నారు.  అలాంటి  ఆర్టీపీపీ ని నిర్వీర్యంచేసే ప్రయత్నాలు తక్షణమే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సన్నద్ధం కానున్నట్లు తెలియజేసారు. ఆర్టీపీపీని నిర్వీర్యం  చేసే ఒక్క ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ సహించదని , పెద్దఎత్తున పోరాటం చేస్తుందన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్ మనోహర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, అన్వేష్, పాపి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts