YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మళ్లీ పార్టీలో అధ్యక్ష పదవి చర్చ

మళ్లీ పార్టీలో అధ్యక్ష పదవి చర్చ

న్యూఢిల్లీ, జూలై 17, 
రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ లో ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 10వ తేదీతో సోనియా గాంధీ పదవి ముగియనుండటంతో మరోసారి అధ్యక్ష్య పదవిపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీని తిరిగి అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని వత్తిడి తెస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం సరిగా లేకపోవడం, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ లో నిరుత్సాహం నెలకొని ఉండటంతో రాహుల్ ను తిరిగి ఏఐసీసీ బాధ్యతలను చేపట్టాలని సీనియర్ నేతలు కోరుతున్నారు.ఈ మేరకు సీనియర్ నేతలు రాహుల్ గాంధీని మరోసారి ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు. తాను అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలే చక్రం తిప్పుతుండటాన్ని రాహుల్ గాంధీ సహించలేక పోతున్నారు. సీనియర్లకు గౌరవం పార్టీలో ఇస్తున్నా, పార్టీ అభివృద్ధి కోసం కాకుండా పదవుల కోసం వెంపర్లాడుతుండటాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా ప్రస్తుత మున్న సమయంలో ఆయన నాయకత్వం పార్టీకి అవసరం. కానీ ప్రతి రాష్ట్రంలో యువనేతలకు అవకాశం ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా తన ఆలోచనలను సీనియర్లు పక్కదోవ పట్టించారు. తల్లి సోనియాగాంధీ అండతో వారు పదవులు చేజిక్కించుకున్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని విడిచి వెళ్లిపోవడానికి సీనియర్లే కారణం. రాజస్థాన్ లోనూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పై కూడా పార్టీ యువనేతల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే సీనియర్ల హవా ఉన్నంత వరకూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేదంటున్నారు. అయితే రానున్న కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రాల్లో క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు. సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Related Posts