YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్..మళ్లీ స్పీడ్ పెంచారు

కేటీఆర్..మళ్లీ స్పీడ్ పెంచారు

హైద్రాబాద్, జూలై 17, 
క్ డౌన్ కాలంలో నిలిచిపోయిన పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది. కొద్దిరోజులుగా తెలంగాణ మంత్రులు యాక్టివ్ గా కన్పిస్తున్నారు. జిల్లాల పర్యటనల చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మూడు నెలల పాటు కేవలం సమీక్షలకే పరిమితమైన మంత్రులు ఇప్పుడు జనం బాట పట్టారు. ఎలాంటి ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సంకేతాలు పంపడానికి మంత్రులు విస్తృతంగా పర్యటిస్తున్నారు.ప్రధానంగా మంత్రి కేటీఆర్ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొన్నటి వరకూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం, లాక్ డౌన్ ఉండటంతో కార్యాలయానికే కేటీార్ పరిమితమయ్యారు. ఐటీ, మున్సిపల్ శాఖలకు చెందిన అనేక అభివృద్ధి పనులు కరోనా కారణంగా నిలిచిపోయాయి. దీంతో గత కొద్ది రోజులుగా కేటీఆర్ మున్సిపల్ శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టారు. జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.కరోనా వైరస్ ఇప్పట్లో వీడిపోయేది లేదని గ్రహించిన మంత్రులు ప్రజల చెంతకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మంత్రుల అధికారిక పర్యటనలతో తెలంగాణలో అనేక పనులకు శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ పై అవగాహన ప్రజలకు కల్పించే విధంగా ప్రసంగాలు ఉండేలా చూసుకుంటున్నారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెల రోజల నుంచి జిల్లాలను పర్యటిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. వీరితో పాటు మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఫాం హౌస్ లో కేసీఆర్ ఉన్నారన్న విమర్శలకు కేటీఆర్ చెక్ పెట్టే విధంగా వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు.

Related Posts