చిత్తూరు జూలై 17,
శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి వెళ్తున్న బస్సులో కరోనా నిబంధనలు గాలికి వదిలి పెట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆర్టీసీలో కరోనా నియంత్రణ చర్యలు నామా మంత్రంగా మారాయి. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నుంచి నాయుడుపేట కు వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని నడపడం విమర్శలకు దారితీస్తోంది. ముగ్గురు ఉన్న సీట్లలో ఇద్దర్నీ, ఇద్దరు సీట్లలో ఒక్కరే నే కూర్చోబెట్టాలి. అయితే నిబంధనలను పక్కన పెట్టి అన్ని సీట్లలో ప్రయాణికులను అనుమతించారు. ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా ప్రయాణికులను అనుమతించారు. ఇలా అనుమతించడం కూడా కొందరు ప్రయాణికులు ప్రశ్నించిన ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. పైగా స్పందించడానికి నిరాకరించారు.