కాకినాడ జూలై 17,
తూర్పుగోదావరి జిల్లాను టోర్నడోలు చుట్టేస్తున్నాయి.తాజాగా యానాంలోని రొయ్యల చెరువులో టోర్నడో బీభత్సం సృష్టించింది. న్యూ రాజీవ్ నగర్ లో ఉన్న ఓ రొయ్యల చెరువులో సుడిగా చెరువులో ఉన్న రొయ్యల్ని చుట్టేసింది. సుడిగాలి బీభత్సానికి చెరువులో ఉన్న రొయ్యలు అమాంతంగా గాలిలో పైకి లేచాయి. రొయ్యలతో పాటు చెరువు ఒడ్డునే ఉన్న వలలు..ఇతర సామగ్రీ కూడా ధ్వంసమయ్యాయి.సుడిగాలో బీభత్సానికి భారీ ఆస్తినష్టం సంభవించిందని రొయ్యల చెరువుల యజమాని వాపోతున్నాడు.కాగా నెల రోజుల క్రితం భైరవపాలెంలోని సముద్రంలో ఏర్పడిన టోర్నడో చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సముద్రంలోంచి నీరు ఆకాశంలోకి ఎదురెళ్లటం చూసి తమ సెల్ ఫోనుల్లో వీడియోలు తీశారు. అమెరికాలో ఎక్కువగా కనిపించే టోర్నడో తూర్పుగోదావరిలో కనిపించేసరికి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు