YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం

ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం

అమరావతి జూలై 17  
ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు మరోసారి ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు సార్లు సుప్రీం కోర్టులో స్టేకు నిరాకరించిన నిమ్మగడ్డను ఎందుకు ఎన్నికల కమిషనర్ గా నియమించలేదని హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించరా అని నిలదీసింది.కాగా నిమ్మగడ్డను వెంటనే ఏపీ గవర్నర్ ను కలిసి హైకోర్టు తీర్పు అమలు చేయాలని కోరాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆది సోమవారాల్లో గవర్నర్ ను నిమ్మగడ్డ కలువడానికి రెడీ అయ్యారు.ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను తొలగించారు. ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.  సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కూడా హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో తాజాగా ఆగ్రహించింది.

Related Posts