YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ దేశీయం

మధ్యప్రదేశ్.. బిహార్.. తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు

మధ్యప్రదేశ్.. బిహార్.. తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు

న్యూ ఢిల్లీ జూలై 17 
భారతదేశంలో వైరస్ పరిస్థితులపై లాన్సెట్ మెడికల్ అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో చాలా అంశాలు వివరించి ఉన్నాయి. వైరస్ ఉధృతి కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ప్రబలుతుందని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. దానికి గల కారణాలను కూడా వివరించింది. దీర్ఘకాలంలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని లాన్సెట్ మెడికల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ రాష్ట్రాలు కాకుండా మధ్యప్రదేశ్ బిహార్ తెలంగాణ వరుసగా మూడు స్థానాల్లో నిలవడం ఆసక్తి రేపుతోంది. మధ్యప్రదేశ్లో వైరస్ పంజా విసిరే అవకాశం ఎక్కువగా ఉందని ఆ సంస్థ తెలిపింది. అనంతరం బిహార్ (0.971) తెలంగాణ (0.943) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఇక నాలుగో స్థానంలో జార్ఖండ్ ఐదో స్థానంలో ఉత్తరప్రదేశ్.. పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 0.714 స్కోరుతో ఉంటుందని అంచనా వేసింది. అది అలా ఉండగా వైరస్ కట్టడి చర్యలు పటిష్టంగా తీసుకుంటున్న రాష్ట్రాల వివరాలు కూడా తెలిపింది. వైరస్ ను ఎదుర్కోవడంలో సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఛండీగఢ్ డామన్ అండ్ డయ్యూ మెరుగ్గా ఉంటాయని ఆ అధ్యయనంలో లాన్సెట్ తెలిపింది. ఆ వివరాలన్నింటినీ ‘ఎ వల్నెరబిలిటీ ఇండెక్స్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ టు ది కోవిడ్-19 ఎపిడమిక్ ఇన్ ఇండియా: ఏన్ ఎకలాజికల్ స్టడీ’ పేరిట ఈ ర్యాంకింగ్స్ను లాన్సెట్ విడుదల చేసింది.
ఈశాన్య భారతం పశ్చిమ దక్షిణ భారత ప్రాంతాల్లోని పర్వత ప్రాంతాల్లో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉందని తెలిపింది. ఈ అధ్యయనం 15 అంశాలను పరిగణనలోకి రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం లాంటి కీలకాంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని లాన్సెట్ పేర్కొంది. సకాలంలో బెడ్లు లేకపోవడం ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం ఆక్సిజన్ కొరత ప్రభుత్వ ఆస్పత్రిల్లో మౌలిక వసతుల లేమి లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని లాన్సెట్ తన నివేదికలో వివరించింది.
- హైదరాబాద్ నగరంలో 48.7 శాతం మంది మహిళలు 33.1 శాతం మంది పురుషులు అధిక బరువుతో బాధపడుతున్నారని.. ఇతర నగరాలతో పోలిస్తే ఇది ఎక్కువని తెలిపింది.
- వృద్ధుల్లో డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారని.. 35-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 15-19 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిల్లో ఆస్తమా ఎక్కువగా ఉందని తెలిపింది.- తెలంగాణలో అంటువ్యాధులు ప్రబలే ముప్పు (0.8) చాలా ఎక్కువగా ఉందంట.- హెల్త్కేర్ (0.65) సరిగా లేదని.. ఇంటి వాతావరణం పరిశుభ్రత (0.629) సరిగా లేవని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న న్యూఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ తెలిపింది.
- నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 జనాభా లెక్కలు రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2018 నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 డేటా ఆధారంగా పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.

Related Posts