YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సుప్రీంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీకి చుక్కెదురు సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

సుప్రీంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీకి చుక్కెదురు      సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్ జూలై 17 
 ఇదే వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి సుప్రీంలో చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జూన్ 29న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌రెడ్డి కోరారు. సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది.తెలంగాణ రాష్ట్ర పాత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగిపోయాయి. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌లన్నీ న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే 80 శాతం భవనాలను కూల్చివేశారు. ఇక కూల్చివేతలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పనులను మరింత వేగంగా పుంజుకోనున్నాయి.పీఎల్. విశ్వేశ్వర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ తెలిపారు. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని స్పష్టం చేశారు. మరోవైపు నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదన్న సోలిసీటర్ జనరల్ వాదనను హైకోర్టు ఏకీభవించింది. అలాగే కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నాకే కూల్చివేత పనులను చేపడుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవాలని కోర్టు సూచించింది. భవనాల కూల్చివేతలకు ప్రభుత్వానికి అన్ని అధికారులు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. పాత సచివాలయం కూల్చివేతకు గతంలో హైకోర్టు అనుమితి ఇవ్వగానే.. చాలా మట్టుకు భవనాలను కూల్చివేశారు. సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. సమీప ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భవనాలు కూల్చివేశారు. ఇలా పనులు చురుగ్గా సాగుతుండగా భవనాల కూల్చివేతలపై పిటిషన్లు దాఖలు కావడంతో న్యాయస్థానం తాత్కాలికంగా బ్రేకులు వేసింది. తాజాగా కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తూ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కూల్చివేత పనులు మరింత వేగంగా జరగనున్నట్లు తెలుస్తోంది.

Related Posts