YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అందరివాడుగా మారుతున్న డీకే

అందరివాడుగా మారుతున్న డీకే

బెంగళూరు, జూలై 18, 
కర్ణాటకలో ఇక డీకే శివకుమార్ టైమ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఆయన ఇటీవలే పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ చిర కాల కోరిక నెరవేరింది. నిజానికి మూడు నెలల క్రితమే ఆయనకు పీసీసీ చీఫ్ పదవిని ఖరారు చేసినా ఇటీవలే ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఆయన పదవీ బాధ్యతల స్వీకారం కూడా అట్టహాసంగా జరిగింది. సిద్ధరామయ్య, దినేష్ గుండూరావుతో సహా అందరూ నేతలు హాజరయ్యారు.అయితే ఇప్పుడు డీకే శివకుమార్ కు ముందున్న సమస్య పార్టీని ముందుకు తీసుకెళ్లడం. సహజంగానే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కర్ణాటకలో బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు 80 స్థానాలను సంపాదించి రెండో అతి పెద్ద పార్టీగా వచ్చింది. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించినా అన్ని సీట్లు దక్కాయంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు డీకే శివకుమార్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకోవాల్సి వస్తుంది.డీకేశివకుమార్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. ఆయన అందరివాడుగా ఉన్నారు. పార్టీ నేతల విషయాలను పక్కన పెడితే ఇతర పార్టీల నేతలు కూడా డీకేను ఇష్టపడతారు. ఇక్కడ కాంగ్రెస్ మిత్రపార్టీగా ఉన్న జనతాదళ్ ఎస్ తో ఆయనకు స్నేహ సంబంధాలున్నాయి. సిద్ధరామయ్య అంటే పడని జేడీఎస్ అగ్రనేతలు కుమారస్వామి, దేవెగౌడలు డీకే శివకుమార్ కు సహకరిస్తారు. దేవెగౌడ రాజ్యసభ పదవి ఎంపిక విషయంనూ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు.అయితే ఎటూ వచ్చి డీకే శివకుమార్ కు సొంత పార్టీ నుంచే ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం ఆయనకు సహకరించే అవకాశం లేదు. పైగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది. దీంతో డీకే శివకుమార్ ముందుగా బలహీన నాయకత్వం ఉన్న నియోజకవర్గాలపై ఆయన దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు పీసీసీ కార్యవర్గంలో కూడా డీకే శివకుమార్ తన ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో డీకే శివకుమార్ మార్క్ రాజకీయాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి

Related Posts