YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

యడ్డీకి బెంగళూర్ టెన్షన్

యడ్డీకి బెంగళూర్ టెన్షన్

బెంగళూర్, జూలై 18, 
ర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ కరోనా సోకడంతో యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఇంటి నుంచే ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తున్నారు. నిజానికి కర్ణాటక తొలినాళ్లలో కరోనాను కంట్రోల్ లో ఉంచింది. యడ్యూరప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.అయితే లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు నలభై వేలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం యడ్యూరప్పలో కలవరం రేపింది. దాదాపు 700 మంది వరకూ కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ కట్టడి విష‍యంలో యడ్యూరప్ప విఫలమయ్యారంటూ విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.ఒక్క బెంగళూరు నగరంలోనే కేసులు దాదాపు పదిహేడు వేలు దాటాయి. మూడు వందల మంది వరకూ మరణించారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత ప్రజలు నిబంధనలు పాటించకపోవడం, టెస్ట్ లు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే తిరిగి బెంగళూరులో కరోనా వ్యాప్తి ఎక్కువయిందన్న విమర్శలు ఉన్నాయి. బెంగళూరులో కరోనా దెబ్బకు భయపడి ఇప్పటికే లక్షలాది మంది నగరాన్ని వీడి వెళ్లిపోయారు.దీంతో బెంగళూరులో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని యడ్యూరప్ప నిర్ణయించారు. ఈనెల 15 వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ బెంగళూరులో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయనున్నారు. కరోనా చైన్ ను కట్ చేయడానికే తిరిగి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించినట్లు యడ్యూరప్ప తెలిపారు. ఈ వారం రోజుల పాటు కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. మొత్తం మీద కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కన్నడనాట మరోసారి లాక్ డౌన్ విధించక తప్పలేదు.

Related Posts