YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తమ్ముళ్లు మొహం చూపించి వెళ్లిపోతున్నారే

తమ్ముళ్లు మొహం చూపించి వెళ్లిపోతున్నారే

కాకినాడ, జూలై 18, 
తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ళల్లో మునుపటి జోష్ లేదు. అధికారం కోల్పోయి టిడిపి ఏడాది దాటినా జగన్ చారిత్రక విజయం ఇచ్చిన షాక్ నుంచి వారు కోలుకోవడం లేదు. ఒకప్పుడు టిడిపి అంటే తూర్పుగోదావరి అన్నట్లు గా ఉండే వాతావరణం నుంచి ఇప్పుడు నేతలు పట్టించుకోకపోవడంతో క్యాడర్ డీలా పడి అధికారపార్టీవైపు చూసే పరిస్థితి ఏర్పడింది. అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే కరోనా వల్ల తెలుగుదేశం ప్రజల్లో చురుగ్గా కార్యక్రమాలు చేపట్టలేని స్థితి నెలకొంది. కేవలం మీడియా సమావేశాలు నేతల అరెస్ట్ సందర్భంగా పెట్టడం తప్ప గుర్తింపు ఉన్న నాయకులు గతంలో ఉన్నంత చురుగ్గా పనిచేయడం లేదనే మాట తమ్ముళ్లే అంటున్నారు.టిడిపి సీనియర్ నేతలు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప లే అటు రాష్ట్ర స్థాయిలోను ఇటు జిల్లా స్థాయిలో కొంత హడావిడి చేస్తున్నారు. మరో మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు కానీ పార్టీ కార్యక్రమాల్లో కరోనా ఎఫెక్ట్ తో అడపాదడపా కనిపిస్తున్నారు. వయసు రీత్యా కూడా గోరంట్ల తన షెడ్యూల్ తగ్గించుకున్నట్లు అంతా చెబుతున్నారు. ఇక రాజమండ్రి ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని పార్టీ బాధ్యతలను, ఎమ్యెల్యే బాధ్యతలను తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పైనే పెట్టారు. ఆమె ఏ కార్యక్రమాలకు అటెండ్ కావడం లేదు. ఆ మధ్య అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత లోకేష్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినప్పుడు సోదరుడు రామ్మోహన నాయుడు తో బాటు బాబాయ్ ఇంట్లో కనిపించిన భవాని మరి బయటకే రావడం లేదు. అలాగే మండపేట శాసన సభ్యుడిగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వర రావు ఊసే లేకుండా పోయింది.ఇక జగ్గంపేట మాజీ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు చాలా చురుగ్గా రాజకీయాలు చేసేవారు. టిడిపి లోకి జ్యోతుల రీ ఎంట్రీ ఆయన ఓటమి తరువాత సైలెంట్ అయిపోయారు నెహ్రు. అదే రీతిలో రాజానగరం మాజీ ఎమ్యెల్యే పెందుర్తి వెంకటేష్ జాడే కనిపించ కుండా పోయింది. ఆ మధ్య లోకేష్ టూర్ లో నియోజకవర్గానికి ఒక లుక్ ఇచ్చిన పెందుర్తి పూర్తిగా రాజమండ్రిలో నే ఉండిపోతున్నారని టాక్. ఇది ఇలా ఉంటె కోనసీమ లో టిడిపి మరీ ఘోరమైన రీతిలో ఉందంటున్నారు. ఇక్కడా మాజీ లు పూర్తి సైలెంట్ నే. ఎలాంటి కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందేవి ఇక్కడ లేకుండా పోయాయి. ఒకప్పుడు బాలయోగి, రాజప్ప వంటివారి తో పాటు బండారు సత్యానందం వంటి చురుకైన నేతలు కోనసీమ లో పసుపు జండా రెపరెపలకు కారకులు. బాలయోగి చనిపోయాక రాజప్ప పెద్దాపురం పై ఫోకస్ పెంచడం, మండలిలో చక్రం తిప్పే రెడ్డి సుబ్రమణ్యం వంటివారు కూడా కోనసీమలో పార్టీని పటిష్టపరిచే చర్యలపై పట్టీపట్టనట్లు ఉండటంతో తమ్ముళ్ళు నలిగిపోతున్నారు.దీనికితోడు టిడిపి స్వయంకృత అపరాధాలు ఆ పార్టీకి శాపాలుగా మారాయంటున్నారు. అలాగే కాకినాడలో దూకుడుగా ఉండే వనమాడి కొండబాబు, పిల్లి సత్తిబాబు లు మౌనవ్రతం లోనే ఉన్నారు. వారు పార్టీలో ఉన్నారని చెప్పుకోవడం తప్ప రాజకీయంగా పెద్దగా క్రీయాశీలకం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రామచంద్రపురం లో టిడిపి కి తోట త్రిమూర్తులు కోలుకోలేని దెబ్బ కొట్టేశారు. దాంతో అక్కడ పార్టీ అడ్రస్ మొత్తం గల్లంతు అయిందనే అంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఎవరనే పరిస్థితి ఉందంటే టిడిపి తూర్పు లో ఎంత దీనంగా ఉందొ చెప్పుకోవక్కర్లేదు.కరడుగట్టిన టిడిపి నేతలు సైతం పవర్ పోయాక సైకిల్ చతికిల పడి గిల గిల్లాడిపోతున్నారు. ఏడాది లోనే చాలామంది డీలా పడినట్లు తెలుస్తుంది. స్థానిక ఎన్నికలు కు సైతం ప్రస్తుతం పూర్తి స్థాయిలో టిడిపి సన్నద్ధం కాలేని దుస్థితి నెలకొంది. దాంతో కొందరు జగన్ ఎస్ అంటే చాలు ఫ్యాన్ కింద చేరి తమ ఉక్కపోత పోగొట్టుకోవడానికి రెడీ అని తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల్లో ఉన్న ఈక్వేషన్స్ తేడా కొడతాయనే వైసిపి ఇప్పట్లో టిడిపి నేతలకు ఆహ్వానాలు ఇచ్చేందుకు సిద్ధం లేకపోవడంతో మరికొంత కాలం సమయం కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా

Related Posts