YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు దేశీయం

వదినతో అసభ్య ప్రవర్తన, శవమై తేలిన తమ్ముడు

వదినతో అసభ్య ప్రవర్తన, శవమై తేలిన తమ్ముడు

లక్నో, జూలై 18, 
అమ్మలా చూడాల్సిన వదినపై కామంతో రగిలిపోయాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం అన్నకి తెలిసిపోయింది. భార్యని వక్రబుద్ధితో చూస్తున్న సోదరుడిని సహించలేకపోయిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. సొంత తమ్ముడు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపేశాడు. అందుకు అతని భార్య కూడా సహకరించడం విశేషం. ఈ ఘటన యూపీలోని పిలిభిత్ జిల్లాలో జరిగింది.జిల్లాలోని బిసాల్‌పూర్‌కి చెందిన బాబురామ్‌కి ఇద్దరు కుమారులు ఓం ప్రకాష్(30), వేద్ ప్రకాష్(20). పెద్ద కొడుకు ఓం ప్రకాష్‌కి అదే ప్రాంతానికి చెందిన గ్యాన్‌ దేవి(26)తో వివాహమైంది. అత్తింటికి వచ్చిన అన్న భార్యపై తమ్ముడు వేద్ ప్రకాష్ కన్నేశాడు. ఆమెతో ఆ సంబంధం కోసం ప్రయత్నించాడు. వదినతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయం అన్నకి తెలిసిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు.వావీవరసలు మరచి వదినపైనే కన్నేసిన తమ్ముడిని క్షమించలేకపోయాడు. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా సోదరుడి గొంతునులిమి చంపేశాడు. శవాన్ని తీసుకెళ్లి పక్కింటి ముందు పడేసి చేతులు దులుపుకున్నాడు. తనకేమీ సంబంధం లేదన్నట్లు డ్రామా మొదలుపెట్టాడు. అయితే తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది.తన చిన్న కొడుకుని పెద్ద కొడుకు, అతని భార్యే హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. చిన్నకొడుకు వేద్ ప్రకాష్ అన్న భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో భార్యాభర్తలు కలసి అతన్ని చంపేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు

Related Posts