YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సెక్రటేరియెట్ భవనం కింద నిధులు జీ బ్లాక్ లో కింద ఏముంది

సెక్రటేరియెట్ భవనం కింద నిధులు జీ బ్లాక్ లో కింద ఏముంది

హైద్రాబాద్, జూలై 17, 
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాక దాని అసలు ఉద్దేశంపై భిన్న రకాల వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనాల్లోని జీ బ్లాక్ భవంతి కింద రహస్య నిధులు ఉన్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన కొన్ని కథనాలు గతంలో కేసీఆర్ సొంత పత్రిక సహా, కొన్ని జాతీయ పత్రికల్లో సైతం వచ్చినట్లు ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేపర్ కటింగ్‌లను చూపించారు. హడావుడిగా సచివాలయ కూల్చివేత పనులు మొదలు పెట్టడం, చుట్టూ 3 కిలోమీటర్ల వరకూ సంచారంపై నిషేధం విధించడం, సీఎం కేసీఆర్.. సీఎస్, డీజీపీలతో రహస్య సమీక్ష నిర్వహించడం వంటి పరిణామాలు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నారని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.నిజాం నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ (ప్రస్తుత సచివాలయ జీ బ్లాక్) కింద రహస్య నిధులు ఉన్నాయని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందని, వాటి అన్వేషణ కోసం అనుమతి కోరితే కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించిందని వార్తలు వచ్చినట్లు అప్పుడు రేవంత్ అన్నారు.మరోవైపు, తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు రెండోసారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ శుక్రవారం సాయంత్రం నుంచి కూల్చివేత పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో రహస్య నిధులు ఉన్నాయనే వాదనలు వస్తు్న్న వేళ నిజాం వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఆఖరి నిజాం (7వ) అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడైన నవాబ్ నజఫ్ అలీ ఖాన్ దీనిపై స్పందించారు.మహ్మదీయ రాజులెవరికీ నేలలో నిధులు దాచే అలవాటు లేదని క్లారిటీ ఇచ్చారు. భూమి మినహా ఇతర ఆస్తులు కూడబెట్టడం పాపమని ఖురాన్‌లో స్పష్టంగా రాసి ఉందని గుర్తు చేశారు. నిజాం రాజులు సొరంగాల్లో గుప్త నిధులు దాచారనే ప్రచారాన్ని నజఫ్ అలీ ఖాన్ ఖండించారు. వాస్తవానికి తమ తాత అయిన ఏడో నిజాం వేసవి విడిది కోసం సైఫాబాద్ ప్యాలెస్ కట్టించుకున్నారని తెలిపారు. అయితే, కట్టడం పూర్తయ్యాక అక్కడకు వెళ్లిన తొలిరోజు ఆయనకు ఎదురుగా తొండ కనిపించడంతో దాన్ని అపశకునంగా భావించిన ఆయన మళ్లీ ఆ వైపునకు వెళ్లలేదని స్పష్టం చేశారు. కాలక్రమేణా ఆ భవనమే సచివాలయంగా రూపాంతరం చెందిందని వివరించారు. భవనాల కింద అక్కడ రహస్య నిధి నిక్షేపాలు ఉంటాయనే ప్రచారం తప్పని ఆయన చెప్పారు.

Related Posts