కర్నూలు జూలై 18,
కరోనా లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని ఎక్స్ రే కోసం బయటికి పంపడంతో రోగి బంధువులు, అతడిని స్ట్రేచర్ పై రోడ్డు పై అర కిలోమీటర్ మేర తీసుకెళ్లారు. కరోనా సమయంలో అందరు ఇంటికే పరిమితం కావాలని అధికారులు చెబుతుంటే....ఆనారోగ్యంతో ఉండి ఆసుపత్రిలో చేరిన వృద్దుడిని ఎక్స్ రే కోసం బయటికి పంపడంతో స్థానికులు భయందోళనలకు గురైనారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడ చికిత్స కోసం వస్తుంటారు. ఆసుపత్రిని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి గా మార్చడంతో ఇతర వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రధాన ఆసుపత్రి పక్కనే ఉన్న కంటి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈక్రమంలో అక్కడ వైద్య పరికరాల కోరత ఉండడంతో రోగులను వివిధ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి నుంచి బయటికి వస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బయటికి వెళ్లే వారిని అంబులెన్స్ లో తీసుకెళితే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.