YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన  ఎమ్మెల్యే

చొప్పదండి జూలై 18 
కరీంనగర్ జిల్లా చొప్ప దండి నియోజక వర్గ కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో గంగాధర మండలానికి చెందిన 8మందికి 1లక్ష 98 వేల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా లబ్దిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి పుల్కం అనురాధ నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ దూలం బాల గౌడ్, డైరెక్టర్ బెజ్జంకి కళ్యాణ్, ర్యాలపల్లి సర్పంచ్ లక్ష్మీ నారాయణ, మాజి ఎం పి టి సి దానె ఓదెలు పలువురు టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts