విజయవాడ జూలై 18
ఇసుక సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అసమర్థ నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు సొంత అవసరాలకు వాడుకునే వారికి నిబంధనలు సడలించండి. ఇసుకపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు. శనివారం అయన వీడియో సమావేశం ద్వారా మీడియాతో మాట్లాడారు. కనీసం నూతన పాలసీలో ప్రజలను, అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి, అభిప్రాయాలు సేకరించాలి. గతంలో తీసుకొచ్చిన రెండు ఇసుక పాలసీల వైఫల్యం అని మీరు ఓప్పుకున్నట్లే కదా? ఇప్పుడేమేూ మరో నూతన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఒకే ప్రభుత్వం సంవత్సరంలో మూడు విధానాలు తీసుకొస్తారా ? *అంటే మీ వైపల్యాలను కప్పిపుచ్చుకోనేందుకే రోజుకొక పాలసి. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి ఇసుక కోసం ప్రజలు రెకమండేషన్ కోసం ప్రజలు వెళ్తున్నారు. కొత్త విధానం వల్ల ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని అయన డిమాండ్ చేసారు.