YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పైలెట్ పై ఆచితూచి వ్యవహరిస్తున్న గెహ్లెట్

 పైలెట్ పై ఆచితూచి వ్యవహరిస్తున్న గెహ్లెట్

జైపూర్, జూలై 18, 
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ విషయంలో అధిష్ఠానం వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోంది. పైలట్‌కు ఇప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఎలాంటి చర్యలు తీసుకోబోమని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో పైలట్‌పై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నరగా సచిన్ నాతో మాట్లాడలేదని అన్నారు.సీఎంతో ఓ మంత్రి మాట్లాడరు.. సలహా తీసుకోరు.. చర్చించరు.. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులు కూడా సీఎంతో మాట్లాడతారు. మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ప్రధానం. గత ఏడాదిన్నరగా మా ఇద్దరి మధ్య ఏర్పడిన దూరం గురించి మీడియాలో వచ్చిన వార్తలతో ఓ పుస్తకం రాయవచ్చు’ అని గెహ్లాట్ పేర్కొన్నారు.ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై ఫిర్యాదు చేయడంతోనే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ నోటీసులు ఇచ్చిందని, కేవలం పైలట్‌నే టార్గెట్ చేయలేదని, 10-12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పైలట్ పేరును ఫిర్యాదులో ప్రస్తావించలేదని, స్పష్టత కోసమే నోటీసు ఇచ్చారన్నారు.రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను 10 రోజుల పాటు ఓ హోటల్‌లో ఉంచాల్సిన పరిస్థితి దాపురించిందని, డిప్యూటీ సీఎంను తక్కువచేసి చూపడానికే అలాచేశానని ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల్లో పీసీపీ అధ్యక్షులుగా ఉన్నవారిని సీఎం పదవిలో కూర్చోబెట్టారని, పైలట్‌ విషయంలో ఎందుకలా జరిగిందని ప్రశ్నించగా.. అది అధిష్ఠానం నిర్ణయని గెహ్లాట్ బదులిచ్చారు.అంతేకాదు, మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాజస్థాన్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తన మద్దతుదారులేనని అన్నారు. తానే ముఖ్యమంత్రి కావాలని రాజస్థాన్ ప్రజలు కోరుకున్నారని ఉద్ఘాటించారు. ప్రస్తుత సంక్షోభంపై మాట్లాడుతూ.. ఒకసారి కొలిక్కి వచ్చిన తర్వాత పరిస్థితి సద్దుమణుగుతుందన్నారు. ఒకవేళ, పైలట్ వెనక్కు వస్తే, ఆయనను మనఃస్ఫూర్తిగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుంటానని అన్నారు.

Related Posts