న్యూఢిల్లీ జూలై 18
గేటెడ్ కమ్యునిటీ నివాస సముదాయాల ప్రాంగణాల్లో, రెసిడెన్సియల్ వెల్‌ఫేర్ అసోసియేషన్లు, రెసిడెన్సియల్ సొసైటీలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల(ఎన్‌జీవోలు) సహాకారంతో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ 19 లక్షణాలు కలిగిన బాధితులకు గేటెడ్ కమ్యునిటీ కాంప్లెక్స్‌లో ఆయా రెసిడెన్సియల్ సొసైటీలు, ఎన్‌జీవో సంస్థలు పరస్పర సహాకారంతో కోవిడ్ పాజిటివ్ వచ్చి లక్షణాలు కనిపించని వారికి, కోవిడ్ లక్షణాలు కనిపించిన వారికి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో సాన్నిహిత్యంగా ఉన్నవారికి చిన్నతరహా చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది.
మార్గదర్శకాలు...
• కోవిడ్ 19 ను నియంత్రించడానికి రెసిడెన్సియల్ వెల్‌ఫేర్ అసోసియేషన్లు, రెసిడెన్సియల్ సొసైటీలు ప్రాథమికంగా చర్యలు చేపట్టాలి.
• ఎన్‌జీవోలతో కలిసి పరస్పర సహాకారంతో కోవిడ్ కేర్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలి.
• వృద్ధులకు, 10 సంవత్సరాల లోపు పల్లలకు, గర్బిణీలకు, షుగర్ పేషంట్లకు, బీపీ పేషెంట్లకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులకు, కాన్సర్ రోగులుకు, రోగనిరోధక శక్త తక్కువ ఉన్నవారికి కోవిడ్ కేర్ సెంటర్‌లోకి అనుమతించకూడదు.
• కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఒకే ప్రదేశంలో ఉంచవద్దు.
• కోవిడ్‌కేర్ సౌకర్యాలు కల్పించిన చోట వైద్య సిబ్బంది, వైద్యుల పర్యవేక్షణ, అంబులెన్స్ సౌకర్యం ఉండాలి.
• రెసిడెన్సియల్ వెల్‌ఫేర్ అసోసియేషన్లు, రెసిడెన్సియల్ సొసైటీలు, ఎన్‌జీవో, డాక్టర్లు, అంబులెన్స్ సర్వీసుల కల్పించే వారి ముఖ్యమైన వారి ఫోన్ నెంబర్లు డిస్‌ప్లే లో కనిపించేలా ఏర్పాటు చేయాలి.
• కొవిడ్ కేర్ సౌకర్యం కల్పించిన చోట ఎప్పటికప్పుడు సానిటైజేషన్ చేసి ఇన్‌ఫెక్షన్లు కలగకుండా చూడాలి.
• కోవిడ్ కేర్ సెంటర్‌లో కఠిన నిబంధనలు అమలుచేయాలి.
• కోవిడ్ లక్షణాలు కలిగిన అనుమానితులను, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క దగ్గర చేరకుండా చూడాలి. వారిరువురిని ప్రత్యేకంగా ఉంచాలి. ఇరువురికి వేరువేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.
• ఈ తాత్కాలిక సదుపాయాన్ని కమ్యూనిటి హాల్, రెసిడెన్సియల్ కాంప్లెక్స్, ఖాళీ ప్రాంగణాల్లో, నివాస సముదాయాల్లో ఖాళీగా ఉన్న ఇండ్లలో ఏర్పాటు చేయాలి.
• ఈ సెంటర్లు నివాస సముదాయాలకు దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి.
• గదిలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వేరువేరు డోర్‌లు ఉండాలి
• బాధితులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునే విధంగా సానిటైజర్ స్టాండ్‌లు డోర్‌ల వద్ద ఏర్పాటు చేయాలి.
• బాధితులను పర్యవేక్షించే సంరక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ నిబంధన ఉండాలి.
• బాధితుల పడకలు ఒకదానికి ఒకటి కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా చూడాలి.
• బాధితులను ఉంచిన గది సహజసిద్ధంగా గాలి వెలుతురు వచ్చేలా ఉండాలి.
• గదిలోని గాలిని బయటకు పంపేందుకు ఎగ్జిట్ ఫ్యాన్ ఉండేలా చూడాలి.