YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్పీకప్ తెలంగాణ కార్యక్రమం

ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్పీకప్ తెలంగాణ కార్యక్రమం

చొప్పదండి జూలై 18 
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికే ఈ నెల 18 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త "స్పీకప్ తెలంగాణ" అనే కార్యక్రమంలో పాల్గొని విజయ వంతం చేయాలని కరీంనగర్ జిల్లా చొప్ప దండి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి డా మేడిపల్లి సత్యం పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోన వ్యాధి పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల, ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం అందక ఎంతో మంది నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్లు దొరకక ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి వైద్యం అందక తమ ప్రాణాలు కోల్పోవడం జరిగుతుందని అన్నారు. అందులో విలేకరులు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది, వ్యాపార, వాణిజ్య మరియు అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారని అన్నారు. హైదరాబాదులో ఒక ఎస్సై సరైన వైద్యం అందక మరణించినారు,సిద్దిపేట జిల్లాలో 108 వాహనం సరైన సమయానికి రాక ఒక వ్యక్తి మరణించడం జరిగిందని తెలియ చేసారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని కావున ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి సోషల్ మీడియా ద్వారా ఈ క్రింది విషయాల పై డిమాండ్ చేస్తూ వీడియో పోస్ట్ చేయాలని తెలియ చేసారు.కరోనా వైద్య చికిత్స ఆరోగ్య శ్రీ లో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు సరిపడా ఏర్పాటుచేసి సరైన చికిత్స అందించాలని కరోన వల్ల మరణాల బారిన పడిన వారికి పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, విలేకరులు ఎవరు చనిపోయిన వారికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి.
5. ప్రైవేటు ఆసుపత్రులలో ఛార్జీలను నియంత్రించి 50% పడకలను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవాలని తెలియ చేసారు. కరోన టెస్టుల సంఖ్య పెంచాలని హోమ్ ఐసోలేషన్ కోసం జిల్లాలోని హోటళ్లలో 50% గదులు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తగిన ఏర్పాట్లు చేసి వైద్యం అందించాలని తెలియ చేసారు.

Related Posts