YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫియాన్స్ ప్రెగ్నెన్సీ ఫోటోతో పాండ్యా

ఫియాన్స్ ప్రెగ్నెన్సీ ఫోటోతో పాండ్యా

ముంబై, జూలై 20, 
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల క్రికెటేతర అంశాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 1న సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్ పాండ్యా.. మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
పెళ్లి కాకుండానే తండ్రి ఏంటి..? అని సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున సెటైర్ల వర్షం కురిపించారు. కానీ.. అవన్నీ ఏమీ పట్టించుకోని హార్దిక్.. తాజాగా తన డ్రీమ్ ఫ్యామిలీ ఫొటోని సోషల్ మీడియాలో వదిలాడు.గర్భంతో ఉన్న నటాషా స్టాంకోవిచ్‌‌.. హార్దిక్ పాండ్య ఒడిలో పడుకుని ప్రేమగా అతనివైపు చూస్తుండగా.. హార్దిక్ మాత్రం పక్కనే ఉన్న తన పెంపుడు శునకాన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు.ఈ ఫొటోని షేర్ చేస్తూ లవ్లీ డ్రీమ్ ఫ్యామిలీ అని అర్థం వచ్చేలా హార్దిక్ క్యాప్షన్ ఉంచాడు. హార్దిక్‌తో పాటు నటాషా స్టాంకోవిచ్‌‌‌కి కూడా పెంపుడు శునకాలంటే మహా ఇష్టం.నటాషాతో ప్రేమ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘‘నేను ఎవరో అప్పటి వరకూ నటాషాకి తెలియదు. ఒక పార్టీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను టోపీ, చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చాడు..? అనుకుందట. అయితే.. నేను తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, ఎంగేజ్‌మెంట్ జరిగిపోయాయి’’ అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.2016, జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఇప్పటి వరకూ 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో ఇప్పటికే 1,799 పరుగులు, 109 వికెట్లు పడగొట్టిన ఈ ఆల్‌రౌండర్.. స్లాగ్ ఓవర్లలో స్కోరు బోర్డుని అమాంతం పెంచడంలో సిద్ధహస్తుడు.

Related Posts