న్యూ ఢిల్లీ జూలై 20
ప్రపంచమంతా ఇప్పుడు దీని గురించే ఆందోళన.. కరోనా రక్కసితో పెరిగిపోతున్న కేసులు.. మరణాలు తలుచుకుంటూ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూడడం తప్పితే మరో మార్గం లేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనా బారిన పడి లక్షలమంది చనిపోయారు. ఈ మహమ్మారి కారణంగా కోట్ల మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉన్న ఉద్యోగాలు పోయాయి. కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. కరోనా అరాచకాలకు అంతే ఉండడం లేదు. కాగా కరోనా వైరస్ గురించి ఓ ఊరట కలిగించే న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. కరోనా వైరస్ భవిష్యత్ లో మరింతగా వీక్ అవుతుందట.. ఎంతగా అంటే ఒక సాధారణ జలుబు స్థాయికి కరోనా తీవ్రత తగ్గిపోతుందట.. దాన్ని అలా తగ్గించే వీలుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు.ఇజ్రాయిల్ సైంటిస్టుల పరిశోధనలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే ‘ఫెనోఫైబ్రేట్’ ఔషధం కరోనాను తగ్గించడానికి ఉపయోగపడుతుందని కనిపెట్టారు. కరోనా సోకిన మానవ ఊపిరితిత్తుల కణాలపై ల్యాబ్ లో ప్రయోగాలు చేసి ఈ విషయం కనిపెట్టారట.. మానవ ఊపిరితిత్తుల్లో లిపిడ్ కు సంబంధించిన జీవక్రియలను కరోనా వైరస్ అడ్డుకుంటోంది. ఈ ప్రక్రియను అడ్డుకుంటే కరోనా లక్షణాలు పెరగకుండా చూడొచ్చట..మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యమే.. కరోనా వైరస్ నూ అడ్డుకుంటోందట.. ఈ వైరస్ అడ్డుకున్న డీఎన్ఏ భాగాన్ని బాగా యాక్టివేట్ చేస్తే ఫైనో ఫైబ్రేట్ పెరిగి వైరస్ పునరుత్పత్తి సామర్థ్యాన్ని బాగా తగ్గిస్తుందట. దీనివల్ల భయంకరమైన కరోనా కూడా రోటీన్ గా వచ్చే జలుబు రేంజ్ కు పడి పోతుందని ఇజ్రాయిల్ సైంటిస్టులు కనిపెట్టారు.