హైదరాబాద్ జూలై 20
ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మైనారిటీల కమిటీ(ఏఐఎస్ఎస్ఐఎంసి) వచ్చే వారం నుండి నిరుద్యోగ విద్యావంతులైన యువత మరియు మహిళలకు ఉచిత ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సును నిర్వహిస్తోన్నట్లు కమిటీ అధ్యక్షుడు ఎస్. జెడ్ సయీద్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో సంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులు ప్రజాదరణను కోల్పోతున్నాయని, డిజిటల్ మార్కెటింగ్ రోజురోజుకు ప్రాచుర్యం పొందుతోందని పేర్కొన్నారు. ఈ కమిటీ డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ అభివృద్ధి, అనుబంధ మార్కెటింగ్, బేసిక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వార్తాపత్రిక మరియు మ్యాగజైన్ డిజైనింగ్, గూగుల్ యాడ్ వరల్డ్ అండ్ యాడ్ సెన్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, SEO, SMO, SEM, లీడ్ జనరేషన్, ఇమెయిల్ మార్కెటింగ్, మార్కింగ్ కోర్సుల కోసం వాట్సాప్ నెంబర్ 98499 32346 లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు, నిరుద్యోగం పెరుగుతున్న మరియు ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కుడ్ కామో ఖుద్ ఖావో పథకం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.