విశాఖపట్నం జూలై 20
జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనపై పాడేరు డీఎస్పీ విబి రాజకమల్ మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు లండులు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. యాలపాలైన మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే మెరుగైన వైద్యసేవలు అందిస్తామని డీఎస్పీ మీడియా ముఖంగా తెలిపారు. కాగా.. ఎదుకాల్పులు జరిగిన ఘటనాస్థలంలో ఐదు కిట్ బ్యాగులు,1 రైఫుల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాలకు రామని ప్రకటించిన మావోయిస్టులు ఇప్పుడు విధ్వంసాలకు పన్నాగాలు పన్నుతున్నారని.. ఖచ్చితంగా వారిని తిప్పికొడతామని డీఎస్పీ ధీమాగా చెప్పారు