YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

‘దిశ’ చట్టానికి దిక్కు లేకుండా చేశారు: చంద్రబాబు

‘దిశ’ చట్టానికి దిక్కు లేకుండా చేశారు: చంద్రబాబు

అమరావతి జూలై 20 
దిశ" చట్టం అమలుపై జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన.. చట్టం చేసేశామని కోట్ల  ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసిందన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస  అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో మైనర్ దళిత బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ప్రస్తావించారు. నాలుగు రోజులపాటు నిర్బంధించి,  చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడి... చివరికి నిందితులే బాధిత బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి... పోలీసులనే సవాల్ చేశారంటే... రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా  పేట్రేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో బాలిక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకో  దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరులో మరో మహిళపై అత్యాచారాలు.. ఇప్పుడీ దళిత మైనర్ బాలిక’’ అంటూ వరుస ఘటనలను గుర్తు చేశారు. 14నెలల్లో  400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్ లు.. నెల్లూరులో మహిళా ఎంపీడీవోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్‌పై దౌర్జన్యాలు, మాస్క్ పెట్టుకోమన్న మహిళా ఉద్యోగినిపై ప్రభుత్వ  కార్యాలయంలోనే భౌతికదాడి.. ఇవన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ట.. పాలకులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే..  దాని దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయి అని  తెలిపారు. ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని  ట్వీట్ చేశారు.

Related Posts