హైదరాబాద్ జూలై 20
నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను డాక్టర్లు విజయవంతంగా ఇద్దరిపై ప్రయోగించారు. ఆ ఇద్దరిని రెండు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. రెండు వారాల తర్వాత రెండో వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రయోగం చేశారు. దేశంలో మొత్తంగా 12 చోట్ల ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తారని ఐసీఎమ్మార్ పేర్కొంది.