YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రమంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి

కేంద్రమంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి

ఢిల్లీ జూలై 20  
ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద గౌడను  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సోమవారం కలిసారు.  తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ  కరోనా దేశాన్ని ఇబ్బంది పెడుతుంది. - వ్యవసాయానికి కరోనా నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం మూలంగా దేశం ఈ రోజు నిలబడింది.  తెలంగాణలో ప్రాజెక్టుల మూలంగా కొత్త ఆయకట్టు భారీగా పెరిగింది.  దేశంలో 60 శాతం జనాభా సంతోషంగా ఉండడానికి కారణం వ్యవసాయమే .  తెలంగాణ ప్రభుత్వానికి ఈ వానాకాలానికి ఇచ్చిన మాటప్రకారం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తప్పకుండా సరఫరా చేస్తాం.  దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయం ఫోన్ చేసి స్పష్టం చేశారు .. తప్పకుండ ఎరువుల కొరత రానివ్వం.  జులై నెలాఖరు నాటికి రావాల్సిన 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేస్తామని తెలిపారు.  రాష్ట్ర మంత్రి మాట్లడుతూ  అంతర్జాతీయం నుండి రావాల్సిన యూరియా త్వరలోనే తెలంగాణకు చేరుస్తామన్న కేంద్ర మంత్రి కి ధన్యవాదాలని అన్నారు.

Related Posts