రియాద్ (సౌదీ అరేబియా) జూలై 20
సౌదీఅరేబియా రాజు సల్మాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 84 ఏళ్ల సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ పిత్తాశయం, మూత్రాశయం వాపు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎగుమతి దేశంగా పేరొందిన సౌదీ అరేబియాకు 2012 నుంచి సల్మాన్ రాజు అయ్యారు. అంతకుముందు ఈయన 50 ఏళ్ల పాటు రియాద్ గవర్నరుగా పనిచేశారు. సల్మాన్ సంప్రదాయక ముస్లిమ్ రాజ్యంలో సామాజిక ఆంక్షలు సడలించి, మహిళలకు హక్కులు కల్పించారు.దీంతోపాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు.రాజు సల్మాన్ కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.