YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తన పాత స్థానాన్ని పునరుద్ధరించండి గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం

 తన పాత స్థానాన్ని పునరుద్ధరించండి గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం

విజయవాడ జూలై 20 
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ భేటీలో ఇద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. సుమారు అరగంటకు పైగా ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు ఆదేశాలతోనే గవర్నర్‌ను కలిశానన్నారు. అరగంటపాటు భేటీ జరిగిందని నిమ్మగడ్డ తెలిపారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా తన పాత స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఓపికగా, సానుభూతితో తాను చెప్పిన అంశాలను గవర్నర్ విన్నారని రమేష్ కుమార్ తెలిపారు. అన్ని విషయాలు నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని తనకు హామీ ఇచ్చారన్నారు. తనకు అనుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తాను భావిస్తున్నానని రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts