YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆమె నెల జీతం14వేలు..... బ్యాంకు ఖాతాలో 200కోట్లు

ఆమె నెల జీతం14వేలు..... బ్యాంకు ఖాతాలో 200కోట్లు

బెంగళూరు జూలై 20 
బెంగళూరుకు చెందిన రేణు తరణి.. ముంబైలో నెలకు 14వేల జీతానికి పనిచేస్తోంది. ఆమె వయసు 80 ఏళ్లు. అంతటి వృద్ధ మహిళకు హెచ్ఎస్.బీసీ బ్యాంకు ఖాతా స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఉంది. ఈ స్విస్ బ్యాంకుతో ఏకంగా రూ.196 కోట్లు ఉండడాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. జరిమానాతో కలిపి ఇన్ కంట్యాక్స్ కట్టాలంటూ ముంబై బ్రాంచ్ ఇన్ కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) ఆమెను ఆదేశించింది. రేణు తరణి ఫ్యామిలీ ట్రస్ట్ పేరుతో ఉన్న ఈ స్విస్ బ్యాంకు ఖాతాకు తరణినే లబ్ధిదారు. 2004లో కేమన్ ఐలాండ్స్ అనే సంస్థ ఈ ఖాతాను ఈ ట్రస్ట్ పేరిట తెరిచారు. తరణి ఫ్యామిలీ ట్రస్ట్ కు ఈ రూ.196కోట్లు బదిలీ చేశారు. 2014 అక్టోబర్ 31న ఈ కేసును ఐటీశాఖ గుర్తించి నోటీసులు పంపింది. అయితే తన జీతం 14వేలు మాత్రమేనని.. ఆ బ్యాంకులో సొమ్ముతో.. షేర్ హోల్డర్ ను కాదని.. తనకు హెచ్ఎస్.బీసీ ఖాతాకు సంబంధం లేదని తరణి స్పష్టం చేసింది. ఆ ఖాతాలో డబ్బులు ఉన్నా తాను పన్ను కట్టబోనని పేర్కొంది.ఆమె ఒక పబ్లిక్ ఫిగర్ కాదు.. అలాగని చారిటీ చేయడం లేదు. అంత సొమ్ము ఆమె ఖాతాలోకి ఎలా వచ్చిందన్న దానిపై ప్రస్తుతం ఐటీశాఖ ఆరాతీస్తోంది.

Related Posts