YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంతుపట్టని గంటా వ్యూహం

అంతుపట్టని గంటా వ్యూహం

విశాఖపట్టణం, జూలై 21, 
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన వైఖరి తెలుగుదేశం పార్టీ నేతలకు సయితం అంతుబట్టడం లేదు. అలాగని పార్టీని వీడి వెళ్లేందుకు ఆయన సిద్ధంగా లేరు. వైసీపీలోకి నో ఎంట్రీ బోర్డు వేలాడుతుండటంతో గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే కొనసాగాల్సి ఉంటుంది. అయితే గంటా శ్రీనివాసరావు ఇటు నియోజకవర్గానికి, ఇటు పార్టీ కార్యక్రమాలకు కొద్దికాలంగా దూరంగా ఉంటున్నారు.సరే.. పార్టీ కార్యక్రమాలంటే ఇష్టం లేకపోవచ్చు. ఒకప్పుడు తన సహచరులు అరెస్ట్ అయినా ఆయన పెదవి విప్పలేదు. వారిని గాని, వారి కుటుంబీకులను గాని పరామర్శించే ప్రయత్నమూ చేయలేదు. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయినప్పటికీ గంటా శ్రీనివాసరావు ఏమాత్రం స్పందించలేదు. ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయినా దానిపైన కూడా గంటా శ్రీనివాసరావు స్పందించలేదు.అయితే ఇటీవల తన అనుచరుడు నలందా కిశోర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం గంటా శ్రీనివాసరావు సీరియస్ గానే స్పందించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు గంటా శ్రీనివాసరావు సీఐడీ ఆఫీసులోనే ఉన్నారు. తన అనుచరుడి కోసం ప్రభుత్వంపైనే విమర్శలకు దిగిన గంటా శ్రీనివాసరావు పార్టీ నేతల విషయాన్ని పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది.ఇక నియోజకవర్గంలో కూడా గంటా శ్రీనివాసరావు అందుబాటులో ఉండటం లేదు. ఇప్పటకే నియోజకవర్గాలను ప్రతిసారీ మారుస్తారని గంటా శ్రీనివాసరావుకు పేరుంది. వరసగా అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో మూడుసార్లు మూడు చోట్ల పోటీ చేశారు. ఈసారి కూడా నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు మారుస్తారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డారు. అందుకే గంటా శ్రీనివాసరావు నియజకవర్గానికి, ఇటు పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

Related Posts