YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జమిలీ ఎన్నికలపై టీడీపీ ఆశలు

జమిలీ ఎన్నికలపై టీడీపీ ఆశలు

విజయవాడ, జూలై 21, 
దస్తు ఎన్నికలు అని టీడీపీ కలలు కంటోంది. జగన్ అధికారం కనీసంగా మూడేళ్ళకే పరిమితం అని కూడా ప్రచారం చేస్తోంది. ఈ కారణం వల్లనే సొంత పార్టీలో ఉన్న బిగ్ షాట్స్ ని వైసీపీ వైపు వెళ్ళకుండా వ్యూహం పన్నుతోంది. అయితే ముందస్తు అంటే అది జగన్ చంద్రబాబులలో ఎవరికి లాభం అన్న దాని మీద పెద్ద చర్చ నడుస్తోంది. నిజానికి అధికార వియోగం ఒక్క రోజు కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. అందుకే ఆయన జగన్ తొందరగా గద్దె దిగాలనుకుంటున్నారు. బాబు వ‌రకూ ఈ విరహం కరెక్టే అనుకున్నా మళ్ళీ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీడీపీకే పట్టం కడతారన్న గ్యారంటీ ఏముంది అన్న ప్రశ్న కూడా టీడీపీలోనే వినిపిస్తోంది.ఇవన్నీ ఇలా ఉంటే జమిలి ఎన్నికల మీద బీజేపీలో చర్చ ఏదైనా జరుగుతోందా అన్నది కూడా వైసీపీ నేతలకు అనుమానంగా ఉందిట. పదే పదే జమిలి ఎన్నికలు అని టీడీపీ నేతలు అంటున్నారు అంటే పొగ ఎక్కడో ఉందన్న డౌట్లు అధికార పార్టీలో వస్తున్నాయట. అయితే దానికి కొంత ఆధారం ఉందని కూడా ఇపుడు తాడేపల్లిలో చర్చ సాగుతోందని అంటున్నారు. అదేంటి అంటే మోడీ పొలిటికల్ గ్లామర్ ఢమాల్ అని ఒక్కసారిగా ఏడాదిలోనే పడిపోయింది. దానికి తోడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో కేంద్రం ఫెయిల్ అయిందన్న భావన జనాల్లోకి పోయింది. లాక్ డౌన్ వేళ కనీసంగా కూడా కేంద్రం నుంచి రూపాయి కూడా ఆర్ధిక సాయం జనాలకు అందలేదు. ఎంత గొప్పగా 20 లక్షల కోట్లు ప్యాకేజి అని చెప్పినప్పటికీ దాని డొల్లతనం బయటపడి జనాలు మరింతగా మండిపోతున్నారు. ఆర్ధిక మాంద్యం కూడా తోడు అయి దేశం మొత్తం తీవ్ర ఇబ్బందులో ఉంది. ఇక కరోనా మహమ్మారి కొన్నాళ్ళకు శాంతించినా దాని ఫలితాలు కూడా భయంకరంగా కొన్నేళ్ళ దాకా దేశాన్ని పట్టి పీడిస్తాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే 2024 నాటికి దేశంలో పేదరికం, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయి అప్పటికి ఎన్నికలకు వెళ్ళినా అధికార పార్టీకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయని కాషాయం పెద్దలు అంచనా వేస్తున్నారుట. అంతే కాదు, ఇపుడు కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంలో ఉంది. మరో నాలుగేళ్ళు సమయం ఇస్తే కాంగ్రెస్ కూడా సర్దుకుంటుంది. అలాగే దేశంలోని ప్రాంతీయ శక్తులు కూడా పుంజుకుంటాయి. దాంతో బీజేపీకి 2024లో గెలవడం మాట పక్కన పెడితే 200 సీట్ల మార్క్ కి రీచ్ అవుతుందా అన్న సందేహాలు కూడా వస్తున్నాయిట. దీంతో కరోనా తగ్గిన వెంటనే అంటే 2022లో జమిలి ఎన్నికలు పెట్టుకుంటే బెటర్ గా ఉంటుందని, మళ్ళీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ భావిస్తోందిట.  
ఇక ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ కే లాభమని అంటున్నారు. 2022 నాటికి జగన్ మూడేళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పటికే ఆయన హామీలను 90 శాతం నెరవేర్చారు సంక్షేమ పధకాలను పట్టాలకెక్కించారు. మరో ఏడాది రెండేళ్ల వరకూ ఆయన ఇలాగేవాటిని కొనసాగించగలరు. దాంతో ఆయన మీద మోజు ఉండగానే ముందస్తు ఎన్నికలు వస్తే మరో అయిదేళ్ళకు అధికారం జగన్ చేతిలో పడుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు మాత్రం జగన్ మీద గుడ్డి అభిమానంతో జనం ఓటు చేశారని, ఈ క్షణం ఎన్నికలు పెట్టినా తమదే గెలుపు అంటున్నారు. అయితే చంద్రబాబు మాటలు కేవలం డాబు సరివని, ఆ డేరింగ్ ఆయనకు ఉంటే లోకల్ బాడీ ఎన్నికలను ఎందుకు వాయిదా వేయించేలా ఎత్తులు వేస్తాడని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక సర్వేలు కూడా ఏపీలో మళ్ళీ జగనే అంటున్నాయని, దాంతో టైం ప్రకారం ఎన్నికలు జరిగినా ముందస్తు గా వచ్చినా కూడా జగన్ కే లాభం వైసీపీలో విశ్లేషణ జరుగుతోందిట.

Related Posts