YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రోజుకో మలుపు తిరుగుతున్న ఆదిత్య హోమ్స్ వ్యవహారం

రోజుకో మలుపు తిరుగుతున్న ఆదిత్య హోమ్స్ వ్యవహారం

హైద్రాబాద్, జూలై 21, 
బంజారాహిల్స్‌లో క‌ల‌క‌లం సృష్టించిన రూ.100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రివాల్వర్ చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇది ఆదిత్య హోమ్స్‌కు చెందిన కుటుంబ సభ్యుల మధ్య విబేధాలే ఈ చోరీకి కారణమని భావిస్తున్నారు. ఈ చోరీలో నిందితుడిగా అనుమానిస్తున్న సుధీర్ రెడ్డిపై ఆయన తల్లి అజంతా సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తన కుమారుడు సుధీర్ ఆ డాక్యుమెంట్లు, రివాల్వర్ ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. రూ. 30 కోట్లు విలువైన ఇంటిని తన పేరు మీద రాయాలని సుధీర్ రివాలర్వ్‌తో తనని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు.తన భర్త చనిపోక ముందే రూ. 30 కోట్ల ఇల్లు నా పేరు మీద రాశారని అజంతా తెలిపారు. ఆ ఇంటిని ఇవ్వలేదనే కారణంతోనే సుధీర్ రెడ్డి తనను ఇంట్లో బంధించి కుక్కలను వదిలాడని ఆమె ఆరోపించారు. తనను వేధించి.. తిరిగి తనపైనే కేసు పెట్టాడని వాపోయారు. విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి ఇంట్లో భద్రపరిచాడన్నారు. సుధీర్ తీరు వల్లే నా భర్త చనిపోయాడని ఆరోపించారు. కుమారుడు నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. తన ఆస్తి మొత్తాన్ని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి రాసిస్తున్నానని తెలిపారుకాగా సుధీర్ రెడ్డి వాదన మాత్రం మరోలా ఉంది. తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన కుమారుడితో తనకు ప్రాణ ఉందని అజంతా ఆరోపించిన తర్వాత సుధీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.15 ఏళ్లుగా బావ కోటారెడ్డి కుటుంబంతో తమకు మాటల్లేవన్నారు. తాను, తన భార్య 1995లో అమెరికా వెళ్లి.. డబ్బు సంపాదించి తిరిగొచ్చామన్నారు. నాన్న చనిపోయే ముందు కుటుంబం మొత్తం కలిసి ఉండాలని కోరుకున్నారని.. దీంతో నాలుగేళ్ల క్రితం తాను ఆదిత్య హోమ్స్‌లో డైరెక్టర్‌గా చేరానన్నారు. అప్పటి నుంచే అమ్మ, అక్క.. తనను వేధిస్తున్నారన్నారు.

Related Posts