YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

భాస్కర్ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

భాస్కర్ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

హైద్రాబాద్, జూలై 21, 
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు ఆజాద్, వెంకటేశ్, భద్రు, సుధీర్, భిక్షపతి, మహేశ్ ఫొటోలతో పోస్టర్లను ఏజెన్సీలో ఏర్పాటు చేశారు. మరోవైపు మావోయిస్టుల కోసం ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు గాలిస్తున్నారు.
మావోయిస్టుల కోసం ఏకంగా రాష్ట్ర డీజీపీనే స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. ములుగు జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాశ్, భాస్కర్, వర్గీస్ లు తెలంగాణలోకి ప్రవేశించినట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. తిర్యాణీ అడవుల్లో భాస్కర్, వర్గీస్.. కొత్తగూడెం అడవుల్లో బండి ప్రకాశ్ దళాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల కోసం మూడు రోజులుగా గ్రేహౌండ్స్ దళాలు ఆపరేషన్ కొనసాగిస్తుండగా, స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆసిఫాబాద్, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.వారం రోజులుగా తెలంగాణలో మావోల కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రేహౌండ్స్, టీఎస్‌ ఎస్‌పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్, స్పెషల్‌ పార్టీ, సివిల్‌ పోలీసులతో భారీ స్థాయిలో కూంబింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. ఆసిఫాబాద్‌లో దాదాపు 500 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 500 మంది వరకు పోలీసులు అడవిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడి దళం సంచారం, 24 గంటల్లో రాష్ట్రంలో రెండుచోట్ల మావోయిస్టులతో పోలీసుల ఎదురు కాల్పులను హోం శాఖ తీవ్రంగా పరిగణించిందని సమాచారం.సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో మావోల రిక్రూట్‌మెంట్‌కు యత్నాలు మొదలుపెట్టడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదిలోనే అణిచివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందుకే భారీ ఆపరేషన్‌కు అప్పటి కపుడు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్‌ దళాన్ని పట్టుకోవడం, లేదా తెలంగాణ నుంచి తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది పోలీసుశాఖ. డీజీపీ మహేందర్‌ రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌కు వెళ్లి తాజా పరి స్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.2009 తర్వాత రాష్ట్రంలో మావోయిస్టు సంచారం దాదాపుగా లేదు. ఇక్కడి గ్రేహౌండ్స్‌ దళాల దూకుడుకు మావో అగ్రనేతలంతా అంతా చత్తీస్‌ఘడ్, ఒడిశాలకు వలస వెళ్లారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా చిన్నస్థాయి కొరియర్లు మాత్రమే వచ్చేవారు. కాని తాజాగా భాస్కర్‌తో పాటు బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌ (వీరిద్దరి తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది), చత్తీస్‌ఘడ్‌కు చెందిన వర్గీస్‌ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్‌ అనిత, పాండు అలియాస్‌ మంగులు, మీనా, రాములతో కూడిన దళం ఆసిఫాబాద్‌లోని తిర్యాణీ మండలం పరిధిలో సంచరించింది. వీరు 24 గంటల్లో రెండుసార్లు స్పెషల్‌ పార్టీకి తారసపడ్డారు. రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో భాస్కర్‌ దళం తృటిలో తప్పించుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానిక యువత అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మావోల రిక్రూట్‌మెంట్లు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు

Related Posts