YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మునగాకు తెలగపిండితో కరోనా దూరం !

మునగాకు తెలగపిండితో కరోనా దూరం !

అనంతసాహితి -ఆయుర్వేదం జీవన వేదం-001.  మునగాకు తెచ్చాను తీసుకోండి‘‘ అని ఒక కూరల కొట్టువాడు కొనుగోలుదారుల్ని బ్రతిమ లాడడం మాకు కని పించింది.
చాలా మంది మాకు వండుకోవడం రాదు అని అంటే, కొంతమంది మునగాకు కూడా తింటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కనిపించింది. చాలా విచిత్రమేమంటే ఆ రోజు తరువాత కూరల కొట్టువాడు మునగాకు తేవడం మానేశాడు. ఈ ప్రహసనం చూస్తే నాకు గోదావరి జిల్లాలలో ఉన్న ఒకపలుకు బడి గుర్తుకు వచ్చింది. ఆషాఢమాసం ఆషాఢభూతిగాడు పోవా లంటే మునగాకు తెలగ పిండి కలిపి తినాలి. ఇది మా గురుపత్నిగారు ప్రతి ఏడాదీ చెప్పేవారు. ఆమె ఆషాఢమాసంలో ప్రయత్నించేవారు కూడా.
అయితే రెండూ దొరికేవి కావు. ఇందులో తెలగపిండి దొరక్కపోవడానికి కారణాలు ఆధునిక నూనెయంత్రాలు గానుగలను పాతేయడంతో జరిగింది. మా చిన్నప్పుడు మా నాన్న నువ్వుల బస్తా కొని, గానుగ ఆడించేవారు. గానుగ ఖాళిగా ఉన్నప్పుడు కబురుపంపితే నువ్వులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. వెండికడ్డీలా నువ్వుల నూనె ఉండేది. అతను గానుగ ఆడుతూ కొంచెం బెల్లం వేసేవాడు.
ఉండచుట్టి  అక్కడే కూర్చున్న మా ముందు ఉంచేవాడు. మేము  ఇంకొంచెం కావాలనే వారం. దానికి  ఆయన ఇదేo చిమ్మిలి నందికేశనోము కాదు.  నూనె తగ్గితే తాతగారు నన్ను తిట్టిపోస్తారు అనేవాడు.  మా  దోవన మేము కూర్చుంటే ఎందుకు రుచి చూపావ్ అని దెబ్బలాడే వాళ్ళం. దానికి అతను నవ్వుతూ
మీ నువ్వులూ మీరే తినండి అంటూ మరికొంత ఇచ్చేవాడు.
ఆ రోజులు పోయాయి.
ఆ అనుభవాలు పోయాయి. అన్నిటికీ మించి ఆ ఆరోగ్యాలు కూడా గానుగ నూనె తోనే నాశనం అయ్యాయి. ముఖ్యంగా తెలుక కులస్తులు గోసేవ చేస్తూ తమ కులవృత్తిగా గానుగలు ఆడేవారు. నేడు అవి పూర్తిగా నాశనం అవు తున్నాయి. వెండి కడ్డీల వంటి నూనెల స్థానంలో జంతువుల కళేబరాల నుంచీ వచ్చి చేరిన కొవ్వు నూనెలు గుండె వైద్యులకు బంజారాహిల్స్ లో మేడలు కడుతున్నాయి. గానుగ నుంచీ వచ్చే తెలగపిండిలో అనేక పోషక విలువలు ఉండేవి. ముఖ్యంగా ఫైబర్ అనే పీచుపదార్థం ఉంటుంది. నూనె ఆడించేటప్పుడు వచ్చిన తెలగపిండిని ఏడాది పొడవునా అనేక వంటల్లో వాడేవారు. నేడు మిల్లు నూనెలల వలన కేవలం పిప్పి మాత్రమే తెలగపిండిలో వస్తోంది. కేవలం పిప్పి మాత్రమే కనుక దాన్ని పశువులకు వేస్తున్నారు. చెక్క దొరక్కపోవడంతో,
మునగాకు కూడా ఉనికి కోల్పోయింది.
మునగాకు, తెలగపిండి గతి తప్పడంతో సర్వరోగాలూ మనల్ని చుట్టుముడు తున్నాయి.
విటమిన్ల పేరుతో రూపాయలు కుమ్మరించి ఆంగ్ల మందులు కొనుక్కుని తరిస్తున్నాము.
ఆషాఢమాసంలో ఆకలి ఎక్కువ వేస్తుందని అరుగుదల బలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మునగాకు, నువ్వుల తెలగచెక్క వండుకొని తినేవారు.  ఆయుర్వేదంలో నువ్వులలో ఉన్న పోషకాల విలువలు మరే వస్తువులోనూ ఇవ్వలేదు. వస్తుగుణదీపిక ఎప్పుడూ కంచిపరమాచార్య నాలుకపై ఉండేది.  అలాగే ఆకుకూరల్లో మునగాకు మహత్తరమైందని ప్రపంచాన్ని దోచుకుతింటున్న ఆంగ్ల వైద్యులు గుర్తించారు.
కానీ వీటిని తింటే తమ లక్షల కోట్లాది రూపాయల విటమిన్ల మాత్రలు ఎవరు కొంటారు. కనుక ఈ ప్రచారాన్ని తొక్కిపెట్టారు.
మా గురుపత్ని వంటి పూర్వతరాలు పోవడంతో నేడు ఈ ఆరోగ్య రహస్యం తెలిసిన వారు కూడా లేకుండా పోయి మునగాకు తింటారా?
ఎలా వండాలనే తరాలు బయల్దేరాయి.
చాలా ఆశ్చర్యం ఏమంటే మేము సంన్యాసాశ్రమంలో  భాగంగా ఉత్తరాది యాత్రలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా హిందీభాషా ప్రాంతాల్లో పర్యటించేపప్పుడు నువ్వులతో చేసిన అనేక తినుబండారాలు షాపుల్లో, తోపుడు బళ్ళమీదా ఉన్నాయి.
చిన్నపిల్లల నుంచీ ముసలి వారు వరకూ వాటిని చిరుతిళ్ళ రూపంలో తినడం మాకు కనిపించింది. దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా తెలుగురాష్ట్రాల్లో నువ్వుల తినుబండారుల కేవలం అలంకారానికి మాత్రమే వాడుతున్నారు. నువ్వుల్లో ఇనుము ఉందని రక్తధాతువుకు ముఖ్యమని చాలా మంది ఆయుర్వేద వైద్యులు అనేవారు. కనుకనే బాలికలు యుక్తవయస్కులు అయ్యే తరుణంతో పనిగట్టుకొని చిమ్మిలి తినిపించేవారని ఇది తినని వారు శూలలకు గురై జీవితాంతం బాధపడతారని గతించిపోయిన బామ్మలు చెప్పేవారు. ఈ అలవాటు తప్పడంతో అసలు యుక్తవయస్సు రావడంలోనే సమస్యలు మొదలు అవుతున్నాయనే వారు లేకపోలేదు.
నువ్వులు సేవించే బాలికలు 100 శాతం ఆరోగ్యంగా ఉండడం పల్లెటూళ్ళలో నేటికీ ఉంది. ప్రభుత్వం పాఠశాల బాలికలకు నువ్వులు బెల్లంతో తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించడం శాస్త్ర రీత్య, ఆరోగ్యరీత్యా మంచిదే. చేయడం కూడా తేలిక.
ఆయుర్వేదం ఉపదేశించిన నువ్వుల నూనె, తెలగపిండి, మునగాకు సేవించే వారిని రోగాలు సోకవు. అద్భుతమైన రోగనిరోధక శక్తి రోగాలు చుట్టుముట్టే ఆషాఢాది వర్షాకాలాలలో కలుగుతుంది. కనుక వీటిని ఎప్పుడు సేవించాలో కూడా ఆయుర్వేదం చెప్పింది.
అయితే కొందరు మహానుభావుల కృషివల్ల మరలా ఆయుర్వేదం వెలుగులోకి వస్తోంది.
తమ వైద్యవిధానం ప్రాచుర్యం పొందడం కోసం ఆంగ్లవైద్యం  చేసిన సాంస్కృతిక హననంలో ఆయుర్వేదాన్ని మరలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  ఈ ఆయుర్వేద రహస్యాలు తెలియని వారు నేడు సామాజిక మాధ్యమాల్లో వ్యాసాలు రాస్తున్నారు.వాటిని చదువుకొని తరించేవారి వల్ల ఆంగ్లవైద్యులు బాగు పడుతున్నారు. భారతీయ జీవనంలో నువ్వులకున్న ప్రాధాన్యత ఇంతా అంతా అని చెప్పడానికి వీలులేదు. సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే తిలల మాహాత్మ్యం మహాభారతంలో చెప్పి వాటిని తినండి అని చెప్పారు. ఇదే అనంతసాహితి స్తోత్రపారయణలో చేర్చింది. మహా మంత్రంగా తిలాన్ తిలాన్ తిలాన్ అని జపం చేయండి అని చెప్పాడు. దీన్ని బట్టీ నువ్వులకు వేదాలు,  ఆయుర్వేదాలు ఇచ్చిన స్థానం గుర్తించవచ్చు.
మృతులకు కూడా నివాళులు అర్పించడంలో నువ్వులు ప్రధానమైనవి. పితృదేవతార్చనకు నువ్వులు, మధ్యాహ్నకాలం, కుమార్తెకుపుట్టిన కుమారుడు అనే దౌహిత్రుడు ముఖ్యం.
చాలా ఆశ్చర్యం ఏమంటే నేడు మునగాకు పొడి రూపంలో ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతోంది. దీన్ని కూరల్లో వాడితే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు దొరికితే, నువ్వుల వేయించుకొని పొడి చేసుకొని వాడినా మంచి రుచిగా, అంతులేని ఆరోగ్యం ఇస్తుంది.
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు అనువదించిన అష్టాదశమహాపురాణాల్లో ఆయుర్వేదం గురించి ఉంది. నేడు ప్రపంచంలో నెలకొన్న కరోనా అస్తవ్యస్తపరిస్థితుల్లో ఆయుర్వేదమే అద్భుతమైన నివారణ మార్గం. వైద్యులు పైసా పిశాచులై ప్రజల్ని పీక్కుతింటున్న తరుణంలో ఆయుర్వేద ప్రాభవాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. పంచమ వేదం అయిన ఆయుర్వేదాన్ని ఏ విధంగా భారతదేశంలో నాశనం చేశారో?
తెలియడానికి ఇటీవల రాందేవ్ బాబా కరోనీల్ అంశంతో మరోసారికి కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా తెలిసి వచ్చింది. రోగాల్ని కూడా వ్యాపారానికి, రాజకీయాలకూ వాడుకునే పిశాచాలు మరోసారి ఆయుర్వేదం దాడి చేస్తున్నాయి.
దీన్ని అనంతసాహితి తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కరోనిల్ నిషేధాన్ని ఆయుర్వేదంపై దాడిగా మేము భావిస్తున్నాము.పొరలు కమ్మిన పాము తన గుడ్లు తానే తిన్న చందంగా, ఆయుర్వేదాన్ని పరిరక్షించాల్సిన భారతప్రభుత్వ రంగ ఆయష్ సంస్థ కాలకూట విషాన్ని ఆయుర్వేదంపై కక్కుతోంది. భారతీయ విజ్ఞానం తెలియని యువత నేడు అదే నిజం అను కుంటోంది.
ఈ సమయంలో యువతను మేల్కొలిపే దిశలో భాగంగా మహాపురాణాల్లోని ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తున్నాము. ప్రాణం మీద తీపి ఉన్నవారు, అల్లోపతి అరాచకరాక్షసుల బారీన పడకూడదనుకునే వారు మా గురుదేవుల పురాణ సాహిత్యం ఆధారంగా వస్తున్న వైజ్ఞానిక వ్యాసాలు అనుసరించమని కోరుతున్నాము. ఇది ‘‘పాత చింతకాయ పచ్చడి‘‘ అనుకునేవారు, కాబూలీవాలాల ద్వారా ఆధునిక వైద్యకబేళాలలకు నిరభ్యంతరంగా చేరు కోవచ్చు.
స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు

Related Posts