YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఏపీతో కేసీఆర్ కుమ్మక్కు

ఏపీతో కేసీఆర్ కుమ్మక్కు

హైదరాబాద్ జూలై 21, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో లోపాయికారి ఒప్పందం వల్లనే ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ వ్యతిరేకించటం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టులపై నాగం జనార్దన్ రెడ్డి ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.. సదురు వీడియో ద్వారా నాగం మాట్లాడుతూ.. తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు.. దిండి ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టుల గురించి ప్రశ్నించే అర్హత ఆంధ్రప్రదేశ్ కు లేదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్రాలు-నీటి వాటాలు అనే అంశంపై ఎలాంటి అవగాహన లేదని తెలుస్తుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్.. నీటి వాటా పై 70వ దశకంలో గులాటి వ్రాసిన గ్రంథాన్ని చదవాలని నాగం సూచించారు. సీఎం వైఖరి వల్ల.. కేవలం 31 శాతం కృష్ణా నీటి వాటాను పొందాల్సిన ఆంధ్ర ప్రదేశ్.. ఇప్పటికే దాదాపు 65% నీటి వనరులను సమకూర్చుకుంది నాగం వెల్లడించారు.

Related Posts