YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అమూల్ తో ఒప్పందం

అమూల్ తో ఒప్పందం

అమరావతి జూలై 21 
ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో  అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం (ఎంఓయూ)పై  అమూల్, ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ల ప్రతినిధులు సంతకాలు చేసారు.   పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు రైతులకు మంచి ధరలు, వినియోగదారులకు సరసమైన ధరలతో అందుబాటులో పాల ఉత్పత్తులు లక్ష్యం గా ఈ ఒప్పందం కుదిరింది.  ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి  హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోని సహకార డెయిరీల పునరుద్ధరణ, అభివృద్ధి, వాటికి పాలు పోసే రైతులకు ఇన్సెంటివ్లు ఇచ్చే దిశగా అడుగులు.
గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ నుంచి అముల్ సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి, సబర్కాంత డిస్ట్రిక్ కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్, యూనియన్ లిమిటెడ్ చైర్మన్ సంబల్ భాయ్ పటేల్,  లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్ఆడుతూ ఏపీకి, అమూల్కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగు. మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. పాల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నాం. కాని కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్నాయి. పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కష్టానికి తగ్గ ధరలు లభించడం లేదు. లీటరు పాలు, లీటరు మినరల్ వాటర్ బాటిల్ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో నాకు రైతులు చూపించారు. లీటరు మినరల్ వాటర్ రూ.22కి లభిస్తే.. పాలు కూడా అంతే ధరకు లభిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వారు తమ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. పోటీ వాతావరణం పూర్తిగా రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చింది. గతంలో ప్రభుత్వ సహకార రంగం బలంగా ఉన్నప్పుడు పోటీ వాతావరణం ఉండేదని అన్నారు.
కాని కాలక్రమంలో ప్రభుత్వ సహకార డెయిరీలు రాజీ పడిపోయాయి.  సహకార డెయిరీలు కంపెనీల చట్టం కిందకు మారిపోయాయి. కొన్ని రాజకీయ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోటీ వాతావరణాన్ని కల్పించి రైతులకు మంచి రేట్లు ఇవ్వాల్సింది పోయి.. చివరకు రాజీ పడిపోయాయి. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కింద ఉన్న డెయిరీలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. అమూల్తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నాం. రైతులకు, సహకార రంగానికి మేలు జరగాలని ఆరాటపడుతున్నాం. మహిళల కోసం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా పథకాలను ప్రారంభిస్తున్నామని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏటా రూ.18,750 చొప్పున చేయూత కింద నాలుగేళ్ల పాటు ఇస్తున్నాం. ఆ విధంగా వారికి నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తాం. ఆగస్టు 12న వైయస్సార్ చేయూత ప్రారంభిస్తున్నాం. దాదాపు 25 లక్షల మహిళలు పథకంలో లబ్ధి పొందుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మహిళలకు ఏటా రూ.6700 కోట్లు వైయస్సార్ ఆసరా కింద ఇస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్మంలో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ వాణీ మోహన్, అమూల్ కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts