మైలవరం జూలై 21
మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం లో బుధవారం సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న వనమహోత్సవం సభ ప్రాంగణం ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్, సీఎం ప్రోగ్రాం సమన్వయకర్త తలశిల రఘురాం,జిల్లా కలెక్టర్ ఎ. యండి.ఇంతియాజ్ మంగళవారం పర్యవేక్షించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇక్కడ మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇవ్వబోయే ఇళ్ల స్థలాల, లే అవుట్ల ముందు జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటుతున్నాం. జగనన్న పచ్చతోరణం కింద రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం గా పెట్టుకున్నాం. ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి, 80 శాతం మొక్కలు లక్ష్యం గా మొక్కలు కాపాడే బాధ్యత గ్రామ సర్పంచ్ లకు ఇచ్చాము, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు వుంటాయని అన్నారు.