హైదరాబద్ జూలై 21
ఇప్పటివరకూ సంతాన ఉత్పత్తిలో కీలకమైన మగాడు..అవసరం లేకుండా రానున్న రోజుల్లో పిల్లలను కనేయవచ్చునని పరిశోదనల్లో తేలింది.శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాల్ని సాధించటం బాగానే ఉన్నా.. కొన్నింటి విషయంలో మాత్రం నేచురల్ గా ఉండటానికి మించింది మరొకటి ఉండదు. అందుకు భిన్నంగా సమస్యల బూచి చూపించి.. దాని పరిష్కారంగా చెప్పే కొన్ని ప్రయోగాలు రానున్న రోజుల్లో సరికొత్త సామాజిక సమస్యలకు దారి తీస్తాయి. తాజాగా ఫలించిన ప్రయోగం కూడా ఆ కోవకు చెందిందే. పురుషుల్లో సంతాన సమస్యల్ని దూరం చేసేందుకు వీలుగా భారీ ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి.అందులో భాగంగా తాజాగా ఒక ప్రయోగం ఫలించిందని చెబుతున్నారు. దీని ప్రకారం పిల్లలు పుట్టాలంటే ఇప్పటివరకూ పురుషుల వీర్యం తప్పనిసరి. ఆ అవసరం లేకుండా ల్యాబుల్లో కృత్రిమ వీర్యాన్నే తయారు చేసిన సంచలనం చోటు చేసుకుంది. దీంతో.. పిల్లలు కావాలనుకునే మహిళలు పురుషులతో పని లేకుండా కృత్రిమ వీర్యంతో పిల్లల్ని కనేసే వీలుంది. ఈ ఘనకార్యాన్ని అమెరికాలోని శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు కనుగొన్నారు.పురుషుల్లో ఉండే స్పెర్మాటోగోనియల్ స్టెమ్ సెల్స్ ల్యాబ్ లలో డెవలప్ చేశారు. ఇవి ప్రతి సెకనుకు వెయ్యికి పైగా స్మెర్మ్..మూలకణాల్ని ఉత్పత్తి చేయగలవు. పురుషుల వృషణాల్లో ఉండే ఇతరత్రా కణాల్ని కృత్రిమం తయారు చేయటంలో సమస్యలు ఉండేవి. తాజాగా శాస్త్రవేత్తల పుణ్యమా అని వాటిని అధిగమించారు. ప్రపంచంలోని ప్రతి ఏడుగురు పురుషుల్లో ఒకరు సంతాన సమస్యను ఎదుర్కొంటున్నారని.. తాజా ప్రయోగ ఫలితంతో దాన్ని అధిగమిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకూ సంతాన ఉత్పత్తిలో కీలకమైన మగాడు.. ఇక అవసరం లేకుండా ఉండటం రానున్న రోజుల్లో మరెన్ని విపరీతాలకు దారి తీస్తుందో చూడాలి.