చిత్తూరు జూలై 21
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం లో రిటైర్డ్ డాక్టర్ వరలక్ష్మి( 67) ను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కల్లూరు ఎస్సై శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల మండలం కొత్తపేట కు చెందిన భద్రయ్య భార్య వరలక్ష్మి డాక్టర్ గా పలువురికి సేవలు అందించి రిటైర్డ్ అయి సొంత గ్రామంలో వుంది. ఆమెకు ఇద్దరు కుమారులు. వృత్తిరీత్యా ఒకరు హైదరాబాదులోనూ మరొకరు బెంగుళూరులో ఉంటున్నారు. వరలక్ష్మి కొత్తపేటలో గుంటూరులో వైద్య సేవలు అందిస్తూ తాను సంపాదించిన డబ్బులు తనకు తెలిసిన వారికి వడ్డీ లకు ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపు తట్టడం తో ఆమె తలుపు తీసింది. వారు ఆమెను కొట్టి గొంతుపై కత్తితో కోసి దారుణంగా హతమార్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును డబ్బును దోచుకెళ్లినట్లుపోలీసులు తెలిపారు. దుండగుల ఆచూకీ కోసం చిత్తూరు నుండి క్లూస్ టీమ్ రప్పించి వారి జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాని అన్నారు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డబ్బు నగల కోసం హతమార్చారా లేక వడ్డీ డబ్బులు తీసుకున్న వారు అయినా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్నది పోలీసు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.