YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిల్డ్ న్యూ ఉస్మానియా డిమాండ్

బిల్డ్ న్యూ ఉస్మానియా డిమాండ్

హైద్రాబాద్, జూలై 22, 
అఫ్జల్ గంజ్ సమీపంలోని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఆందోళన చేపడుతున్నారు. ‘సేవ్ ఉస్మానియా, బిల్డ్ న్యూ ఉస్మానియా పేరుతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల జేఏసీ నేత రమేష్ స్పందించారు. కూలిపోతున్న ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చవద్దని అడ్డుపడటం సరికాదని అన్నారు. ఇది అవివేకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాణాలు నిలబెట్టే ఉద్దేశ్యంతో పూర్వం ఈ ఆస్పత్రిని నిర్మించారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఇది కూలి ప్రాణాలు తీసేలా ఉందని తెలిపారు.వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న ప్రజల ప్రాణాలు, అందులో వారికి సేవలందిస్తున్న తమ ప్రాణాలు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయని రమేష్ చెప్పుకొచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిని కచ్చితంగా కొత్తగా పునర్నిర్మించాలని రమేష్ డిమాండ్ చేశారు. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆస్పత్రిని పరిశీలించి కొత్త భవనం నిర్మించేందుకు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ఆ సమయంలో కొంత మంది అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.ఆ సమయంలో దీన్ని అడ్డుకొనేందుకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని తప్పుబట్టారు. కానీ, ఈసారి బిల్డింగ్ నిర్మాణానికి ఎవరైనా అడ్డు పడితే సహించేది లేదని డాక్టర్ రమేష్ హెచ్చరించారు.ఈ సందర్భంగా పాత భవనాన్ని కూల్చేసి.. కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులంతా డిమాండ్ చేశారు. నిజాం నవాబు పేరు మీదైనా.. కొత్త భనవం నిర్మించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రిలో నీరు చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల ఏళ్ళ క్రితం భాగ్యనగరవాసుల  ప్రాణాలు నిలబెట్టే ఉద్దేశ్యంతో పూర్వం ఈ ఆస్పత్రిని నిర్మించారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఇది కూలి ప్రాణాలు తీసేలా ఉందని డాక్టర్లు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.

Related Posts