YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆమంచికి పదవీ గండం...

ఆమంచికి పదవీ గండం...

ఒంగోలు, జూలై 22, 
ఆమంచి కృష్ణమోహన్ కు వైసీపీ అధిష్టానం షాక్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జి పదవి నుంచి ఆయనను తొలగించాల్సని వాతావరణం నెలకొంది. కరణం బలరాం రాకతో ప్రస్తుతం వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను ఆ పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యేగా కరణం బలరాం ఉండటం, ఆయన వైసీపీకి మద్దతిస్తుండటంతో ఆమంచికి షాక్ ఇవ్వక అధిష్టానానికి తప్పేట్లే లేదు.ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో పట్టున్న నేత. ఆయన వరసగా రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికలో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమంచి కృష్ణమోహన్ కు ఇబ్బంది లేకుండా పోయింది. అనధికారికంగా ఆమంచి ఎమ్మెల్యేగా వ్యవహరించేవారు.కానీ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కరణం బలరాం వైసీపీ చెంతకు చేరారు. దీంతో ఆయనతో కలసి పనిచేయాల్సిన పరిస్థితి ఆమంచి కృష్ణమోహన్ కు ఏర్పడింది. కానీ తాను కరణంతో కలసి పనిచేయలేనని ఆమంచి అధిష్టానానికి చెప్పేశారు. ఇప్పటికీ ఆమంచి, కరణం గ్రూపులు ఒకే పార్టీలో ఉన్నా వీధి పోరాటాలకు దిగుతున్నాయి. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ దూకుడుకు బ్రేకులు వేయాలని కరణం బలరాం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.తాను ఎమ్మెల్యేగా ఉండటంతో వైసీపీ ఇన్ ఛార్జి పదవి నుంచి ఆమంచి కృష్ణమోహన్ ను తొలగించాలని కరణం డిమాండ్ చేస్తున్నారు. ఇది సబబేనని భావించిన అధిష్టానం ఇటీవల ఆమంచిని పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. ఆమంచి కృష్ణమోహన్ కు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జక్కంపూడి రాజా పదవీకాలం ముగిసిన వెంటనే ఇస్తామని ఆమంచికి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఆమంచి కృష్ణమోహన్ ససేమిరా అంటున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆమంచి కృష్ణమోహన్ ను వైసీపీ ఇన్ ఛార్జి పదవి నుంచి తొలగించడానికే డిసైడ్ అయింది.

Related Posts